NTR: నారా లోకేశ్‌కు ఆర్జీవీ సూటి ప్రశ్న.. ‘ఎన్టీఆర్ హంతకుడిని..’
ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళి అర్పిస్తూ నారా లోకేశ్ ఎక్స్ (ట్విట్టర్)లో ఓ పోస్టు పెట్టారు. దానికి ఆర్జీవీ రియాక్ట్ అయ్యారు. నారా లోకేశ్‌ను సార్ అని సంబోధిస్తూ ఓ ప్రశ్న వేశారు.
టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత ఎన్టీఆర్ వర్ధంతి ఈ రోజు. ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకుని టీడీపీ గుడివాడలో రా కదలిరా సభ నిర్వహించింది. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు సహా ఆయన అభిమానులందరూ నివాళి అర్పించారు. చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్ కూడా నివాళులు అర్పించారు. దీనికితోడు ఎక్స్ (ట్విట్టర్)లోనూ నారా లోకేశ్ ఎన్టీఆర్‌కు నివాళి అర్పిస్తూ పోస్టు పెట్టారు. ఆ పోస్టుపై సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రియాక్ట్ అయ్యారు.
‘తెలుగు జాతి ఖ్యాతి మహానాయకుడు ఎన్టీఆర్ గారి వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాను. కోట్లాది హృదయాల్లో కొలువైన కారణ జన్ముడికి జోహార్లు’ అని నారా లోకేశ్ పోస్టు చేశారు. ఎన్టీఆర్ అమరుడు అని హ్యాష్ ట్యాగ్ చేశారు.
ఈ ట్వీట్ పై ఆర్జీవీ షార్ప్‌గా రియాక్ట్ అయ్యారు. ‘మరి.. ఆ ఎన్టీఆర్ హంతకుడిని మీరు ఏం చేస్తారు సార్?’ అంటూ ప్రశ్నించారు.
Also Read : NTR: వెయ్యి మంది బాలకృష్ణలు, చంద్రబాబులు వచ్చినా.. : జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీ వివాదంపై కొడాలి నాని
ఈ ట్వీట్‌లకూ విపరీతమైన రెస్పాన్స్ వస్తున్నది. టీడీపీ, వైసీపీ అభిమానులు రీట్వీట్లు చేస్తున్నారు. కామెంట్లు పెడుతున్నారు. కొందరు ఆర్జీవీని సపోర్ట్ చేస్తుంటే ఇంకొందరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ ట్వీట్ రాజకీయమైనది కావడంతో సోషల్ మీడియాలో దుమారం రేగుతున్నది.