శశికళ తన మేనల్లుడ్ని పార్టీలో అత్యున్నత పదవి కట్టబెట్టారు. దాంతో పార్టీలో తిరుగుబాట్లు మొదలయ్యాయి.
బెంగుళూరుకు శశికళ బయలుదేరిన కొద్ది సేపటికే చిన్నమ్మ కుటుంబంపై తిరుగుబాట్లు మొదలయ్యాయి. పార్టీ డిప్యుటి జనరల్ సెక్రెటరీగా తన మేనల్లుడు టిటివి దినకరన్ను శశికళ నియమించారు. పార్టీలో జనరల్ సెక్రెటరీనే ఉన్నారు కానీ డిప్యుటి అనే పోస్టే లేదు. కానీ నాలుగేళ్ళు జైలుశిక్ష పడిన నేపధ్యంలో పార్టీపై తన పట్టు కోల్పోకూడదన్న ఉద్దేశ్యంతో శశికళ తన మేనల్లుడ్ని పార్టీలో అత్యున్నత పదవి కట్టబెట్టారు. దాంతో పార్టీలో తిరుగుబాట్లు మొదలయ్యాయి.
ఏఐఏడిఎంకెను శశికళ తన కుటుంబ పార్టీగా మార్చేసిందని పార్టీలోని పలువురు నేతలు మండిపడుతున్నారు. దినకరన్ నియామకాన్నివ్యతిరేకిస్తూ పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి పాండ్యన్ రాజీనామా చేసారు. మరికొందరు నేతలు కూడా పాండ్యన్ దారిలోనే ఉన్నట్లు సమాచారం. ఎందుకంటే, జయలలిత ఉన్నంత కాలం దినకరన్ను పార్టీ నుండి దూరంగా తరిమేసారు. జయ మరణించే వరకూ పార్టీ దరిదాపుల్లో కూడా ఎక్కడా కనబడలేదు. అటువంటిది జయమరణించిన రోజు నుండి మళ్ళీ దినకరన్ చిన్నమ్మ పక్కనే కనబడుతున్నారు. దానికి ముగింపు అన్నట్లు పార్టీలో ఉప ప్రధాన కార్యదర్శి కూడా కట్టబెట్టారు. దాంతో పార్టీలో తిరుగుబాట్లు మొదలయ్యాయి.
