వచ్చే ఎన్నికల్లో టిఆర్ఎస్-టిడిపి మద్య పొత్తు ఖాయమన్న ప్రచారం మొదలైంది. ఆ విషయంపైనే రేవంత్ ఏపి టిడిపి నేతలపై బుధవారం మండిపడ్డారు. ఏపి టటిడిపిలోని యనమల రామకృష్ణుడు, పరిటాల సునీత, పయ్యావుల కేశవ్ తదితరులకు కెసిఆర్ కు మధ్య ఉన్న సంబంధాలపై రేవంత్ చేసిన ఆరోపణలు సంచలనంగా మారింది. ఢిల్లీ పర్యటన నుండి తిరిగి వచ్చిన తర్వాతే రేవంత్ మాటల్లో పదును పెరిగింది.
కెసిఆర్ మమ్మల్ని జైళ్ళల్లో పెట్టిస్తుంటే మీరు దండాలు పెడతారా ?
ఏపి మంత్రి యనమలకు కెసిఆర్ రూ. 2 వేల కోట్ల కాంట్రాక్టు ఇచ్చారు..
తెలంగాణాలో చంద్రబాబుకు దక్కని గౌరవం..ఏపిలో కెసిఆర్ కు ఎందుకు ?
ఇవి...తాజాగా కెసిఆర్-ఏపి టిడిపి నేతలను ఉద్దేశించి టిటిడిపి రేవంత్ రెడ్డి లేవనెత్తిన ధర్మ సందేహాలు, ఆరోపణలు. రేవంత్ వైఖరి చూస్తుంటే ఏపి టిడిపిలో చిచ్చు పెట్టేట్లే ఉన్నారు.
దీపావళి పండుగ సందర్భంగా పేల్చిన బాంబు రెండు రాష్ట్రాల్లోనూ అదిరిపోతోంది. టిడిపిలో అయితే పెద్ద కలకలమే రేపుతోంది. పరిటాల శ్రీరామ్ పెళ్ళి సందర్భంగా వెంకటాపురం కు కెసిఆర్ వెళ్ళటం, పయ్యావుల కేశవ్ తో కెసిఆర్ ప్రత్యేకంగా మంతనాలు జరపటంతో రసవత్తర నాటకానికి తెరలేచింది. అక్కడి నుండి పరిస్ధితులు ఒకరకంగా చంద్రబాబునాయుడు చేతిలో కూడా లేవు. కేశవ్-కెసిఆర్ భేటీపై తెలంగాణా టిటిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ పెద్ద ఎత్తున మండిపడిన సంగతి అందరకీ తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో టిఆర్ఎస్-టిడిపి మద్య పొత్తు ఖాయమన్న ప్రచారం మొదలైంది.

ఆ విషయంపైనే రేవంత్ ఏపి టిడిపి నేతలపై బుధవారం మండిపడ్డారు. ఏపి టటిడిపిలోని యనమల రామకృష్ణుడు, పరిటాల సునీత, పయ్యావుల కేశవ్ తదితరులకు కెసిఆర్ కు మధ్య ఉన్న సంబంధాలపై రేవంత్ చేసిన ఆరోపణలు సంచలనంగా మారింది. ఢిల్లీ పర్యటన నుండి తిరిగి వచ్చిన తర్వాతే రేవంత్ మాటల్లో పదును పెరిగింది. త్వరలో రేవంత్ కాంగ్రెస్ లో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. సరే, ప్రచారాన్ని రేవంత్ కొట్టిపారేస్తున్నప్పటికీ నిప్పులేనిదే పొగ రాదు కదా?
ఎప్పుడైతే ఏపి టిడిపి నేతలకు, కెసిఆర్ తో ఉన్న సంబంధాలను బయటపెట్టారో అప్పుడే రేవంత్ టిడిపిని వదిలేయటం ఖాయమన్న విషయం అర్ధమవుతోంది. కెసిఆర్ తో సంబంధాలపై ఏపి నేతలను ఉద్దేశించి రేవంత్ బయటపెట్టిన అంశాలపై యనమల, పరిటాల సునాత, పయ్యావుల లేదా చంద్రబాబు సమాధానం చెప్పాల్సిన పరిస్ధితిని రేవంత్ సృష్టించారు. లేకపోతే రేవంత్ చెప్పిన విషయాలను గనుక జనాలు నమ్మితే వచ్చే ఎన్నికల్లో టిడిపికి ఇబ్బందులు తప్పవేమో అనే అనిపిస్తోంది.
