ఒంగోలు: ప్రకాశం జిల్లాలోని చీరాల మండలం తోటవారిపాలెంలో రిటైర్డ్ ఎఎస్ఐ నాగేశ్వరరావును  రౌడీషీటర్ సురేంద్ర హత్య చేశాడు. ఈ ఘటన ఆ గ్రామంలో  విషాదాన్ని నింపింది.  రౌడీ షీటర్ సురేంద్ర కోసం పోలీసులు గాలింపు  చేపట్టారు పోలీసులు.

తోటవారిపాలెంలో సురేంద్ర అనే వ్యక్తి నివసిస్తున్నాడు. ఆయనపై రౌడీషీట్ ఉంది. ఇదే ప్రాంతంలో రిటైర్డ్ ఎఎస్ఐ నాగేశ్వరరావు ఉంటున్నాడు. ప్రతి రోజూ మద్యం తాగొచ్చి సురేంద్ర స్థానికులతో గొడవలకు దిగేవాడు. అంతేకాదు బూతులు తిట్టేవాడు.  అయితే ఈ విషయమై రిటైర్డ్ ఎఎస్ఐ నాగేశ్వరరావు..... సురేంద్రను మందలించాడు.

అందరి ముందు తనను తిట్టాడని సురేంద్ర కక్ష పెంచుకొన్నాడు. శుక్రవారం నాడు అర్ధరాత్రి ఎఎస్ఐ నాగేశ్వరరావు  ఇంట్లోకి వెళ్లి కర్రతో ఆయనపై దాడి చేశాడు. ఆకస్మాత్తుగా నాగేశ్వరరావుపై సురేంద్ర దాడికి దిగడంతో ఆయన అక్కడికక్కడే మరణించాడు. 

అయితే నాగేశ్వరరావు కుటుంబసభ్యులు సురేంద్ర దాడి చేసిన విషయాన్ని పసిగట్టి  అరిచారు.  దీంతో సురేంద్ర పారిపోయాడు. సురేంద్ర దాడితో నాగేశ్వరరావు అక్కడికక్కడే మరణించాడు.  సురేంద్ర కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.