చిత్తూరులో కిలో రూ. 150: రాకెట్ స్పీడ్‌లో దూసుకుపోతున్న టమాట ధర

 దక్షిణ భారత దేశంలో  టమాట ధర  భారీగా పెరిగింది. అకాల వర్షాల కారణంగా టమాట పంట దెబ్బతింది. మరో వైపు టమాటకు డిమాండ్ పెరగడంతో టమాట ధర పెరిగిందని వ్యాపారులు చెబుతున్నారు. చిత్తూరు జిల్లాలోని వి కోట మార్కెట్ లో కిలో టమాట రూ. 150కి చేరింది.

Retail tomato prices in South rise up to Rs 150 per kg due to rains

న్యూఢిల్లీ: దేశంలోని పలు చోట్ల కురిసిన భారీ వర్షాల కారణంగా టమాట ధర  పెరిగింది. కిలో టమాట ధర రూ. 150లకు చేరింది.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా వి. కోటలో కిలో టమాట ధర రూ. 120లకు చేరింది.  tamilnadu రాష్ట్రాన్ని రెండు వారాలుగా భారీ వర్షాలు ముంచెత్తాయి. రానున్న రెండు మూడు రోజుల్లో మళ్లీ వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది.  ఈ హెచ్చరికల నేపథ్యంలో  వాతావరణ శాఖ నేపథ్యంలో  అధికారులు జాగ్రత్తలు తీసుకొన్నారు. 

చెన్నైలో కిలో tomoto  రూ. 100లకు చేరింది. పాండిచ్చేరిలో కిలో టమాట రూ. 90లకు చేరింది.బెంగుళూరులో కిలో టమాట ధర రూ.88లకు చేరింది హైద్రాబాద్ లో కిలో టమాట రూ. 65గా ఉన్నట్టుగా అధికారులు చెబుతున్నారు.ఇక kerala రాష్ట్రంలో  కిలో టమాట ధర రూ. 120లకు చేరింది. కొట్టాయంలో రూ.110లకు చేరింది. ఎర్నాకుళంలో  రూ. 103, త్రివేండ్రంలో రూ. 100, పాలక్కాడ్ లో రూ. 97, త్రిస్సూర్, కోజికోడలలో  లో రూ. 90లకు చేరింది.

also read:చుక్కలను తాకిన టమోటా ధరలు.. పెట్రోల్ రేటును దాటేసిందిగా, కేజీ ఎంతో తెలుసా..!!!

karnatakaరాష్ట్రంలో  కిలో టమాట రూ.85, ధర్వాడ్ లో రూ. 84, మైసూరులో రూ.80, మంగుళూరులో 78 లకు విక్రయిస్తున్నారు. andhra pradesh రాష్ట్రంలో  విజయవాడలో రూ. 91, విశాఖపట్టణంలో రూ. 80, తిరుపతిలో రూ. 75లకు కిలో చొప్పున అమ్ముతున్నారని అధికారులు చెబుతున్నారు. ఇక చిత్తూరు జిల్లాలోని వి.కోట మార్కెట్ లో ఇవాళ టమాట ధర కిలో రూ. 150 గా పలికింది. తమిళనాడులోని రామనాథపురంలో రూ. 119, తిరునల్వేలిలో రూ. 97, కడలూరు, కోయంబత్తూరులలో 90లకి కిలో చొప్పున  విక్రయిస్తున్నారు.  ఇక దేశ రాజధాని న్యూఢిల్లీలో  కిలో టమాటను రూ. 72లకు విక్రయిస్తున్నారు.

ఈ ఏడాది అక్టోబర్ మాసం నుండి టమాట రిటైల్ ధరలు పెరుగుతున్నాయని కేంద్ర ప్రభుత్వ ఆహార మంత్రిత్వశాఖ గణాంకాలు చెబుతున్నాయి. అక్టోబర్ 1న ఆలిండియా మోడల్ టమాట రిటైల్ ధర కిలోరూ. 40గా ఉంది. అక్టోబర్ నెలాఖరుకు రూ. 50కి చేరుకొంది. ఈ నెల 23 నాటికి కిలో టమాట ధర రూ. 80కి పెరిగిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా ఏర్పడిన తుఫానులు, ఈశాన్య రుతు పవనాల ప్రవేశంతో కురిసిన భారీ వర్షాల కారణంగా  దక్షిణ భారత దేశంలోని పలు ప్రధాన నగరాల్లో రిటైల్ టమాట ధరలు పెరిగాయని అధికారులు తెలిపారు.

heavy rains కారణంగా టమాట పంట దెబ్బతినడంతో పాటు సరఫరా కూడా నిలిచిపోవడంతో ధరలు పెరిగినట్టుగా వ్యాపారులు చెబుతున్నారు.దక్షిణ భారత దేశం నుండి ఢిల్లీకి టమాట సరఫరా తగ్గిపోయింది. దీంతో ఢిల్లీలో కూడా టమాట ధరలు పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు. రాజస్థాన్, ఉత్తరాఖండ్, నుండి దేశీయ టమాట రావడంతో ఢిల్లీలోని ఆజాద్ పూర్ హోల్ సేల్ మార్కెట్ లో టమాట ధరలు స్వ్పంగా తగ్గాయి. ఆంధ్రప్రదేశ్,కర్ణాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో టమాట సాగులో ఉంది. అయితే వర్షాల కారణంగా టమాట దెబ్బతింది.ప్రపంచంలోని చైనా తర్వాత ఇండియాలోనే  ఎక్కువగా టమాటను పండిస్తున్నారు.  టమాట పంట  రెండు మూడు నెలల్లోనే  టమాట పంట చేతికి రానుంది. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios