Asianet News TeluguAsianet News Telugu

అందుకే జిల్లా ఇన్ఛార్జిలను మార్చారా?

లోకేష్ కూడా ఏ జిల్లాను అప్పగించలేదు. లోకేష్ ను ఏ ఒక్క జిల్లాకో పరిమితం చేయకుండా అన్నీ జిల్లాలను చూసుకునేందుకే ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించలేదని నేతలు అభిప్రాయపడుతున్నారు.

reshuffle of district in charge ministers triggered a heated debate in TDP

జిల్లా ఇన్ఛార్జి మంత్రులను హటాత్తుగా మార్చటంపై పార్టీలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. ప్రతీ మంత్రికి ఓ జిల్లాలను ఇన్చార్జిగా ఇటీవలే నియమించారు చంద్రబాబునాయుడు. అయితే, హటాత్తుగా గురువారం రాత్రి మళ్ళీ అందరినీ మార్చేసారు. ముందస్తు సమాచారం కూడా లేకుండా ఒక్కసారిగా అందరినీ ఎందుకు మార్చారో అర్ధం కావటం లేదు. ముందస్తు ఎన్నికల ఊహాగానాలకు, మంత్రుల మార్పిడికి ఏమన్నా సంబంధం ఉందా అంటూ పలువరు ఆరాలు తీస్తున్నారు.

మొన్ననే జరిగిన ఎంఎల్సీ ఎన్నికల్లో కడప, కర్నూలులో అచ్చెన్నాయుడు, గంటా శ్రీనివాసరావులు బాగా పనిచేసారంటూ చంద్రబాబే అభినందించారు. ఎందుకంటే పై రెండు జిల్లాల్లో కర్నూలుకు అచ్చెన్నాయుడు, కడపలో గంటా ఇన్ఛార్జీలు. నెల్లూరుకు చెందిన సోమిరెడ్డి చంద్రబాబుమోహన్ రెడ్డి ఎన్నికల్లో మాత్రమే ఇన్ఛార్జిగా ఉన్నారు. అటువంటిది గంటా స్ధానంలో సోమిరెడ్డినే నియమించేసారు. అంటే కడపలో రెడ్ల ప్రాబల్యం ఎక్కువ. కాబట్టి సోమిరెడ్డిని నియమించారని అనుకోవాలి.

కర్నూలుకు ఇన్ఛార్జీగా ఉన్న అచ్చెన్నాయడు కూడా బిసినే. అయితే ఆ స్ధానంలో కాల్వ శ్రీనివాసులును నియమించారు. కాల్వ కూడా బిసినే. కాకపోతే కాల్వది బోయ కులం. అందునా కర్నూలు, అనంతరపురం జిల్లాల్లోని సరిహద్దు నియోజకవర్గాల్లో బోయలెక్కువ. కాబట్టే కాల్వను నియమించారని అనుకోవాలి.

ఇక, విశాఖపట్నం జిల్లాకు చెందిన గంటాను తాజాగా విజయనగరం జిల్లాకు ఇన్ఛార్జిగా  నియమించారు. ప్రతీ ఎన్నికకూ ఒక నియోజకవర్గాన్ని మారుస్తున్న గంటాకు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయటానికి సేఫ్ నియోజకవర్గం జిల్లాలో లేదు. అందుకే వచ్చే ఎన్నికల్లో గంటా విజయనగరం జిల్లా నుండి పోటీ చేస్తారంటూ ప్రచారం మొదలైపోయింది.

అదేవిధంగా, కృష్ణా జిల్లాలో యాదవ సామాజికవర్గం కూడా బాగానే ఉంది. అందుకనే వైసీపీ యాదవ సామాజిక వర్గానికే చెందిన పార్ధసారధిని నియమించింది. అందుకనే యనమలను ఈసారి కృష్ణా జిల్లాకు ఇన్ఛార్జిగా నియమించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

కృష్ణా జిల్లాకు చెందిన నీటి పారుదల శాఖమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును అనంతపురం జిల్లాకు నియమించారు. అనంతలో కమ్మ సామాజిక వర్గం బలంగా ఉంది. పరిటాల సునీతది కూడా అదే సమాజికవర్గమైనా ఆమెపై వ్యతిరేకత పెరిగిపోయింది. అందులోనూ నీటిప్రాజెక్టులపనులు సరిగా జరగటం లేదని ఆరోపణలు వినబడుతున్నాయి. కాబట్టి ప్రాజెక్టులను స్పీడ్ చేసేందుకు కూడా ఉమ ఉపయోగపడతారని అనుకునుండచ్చు.

కాగా కెఇ కృష్ణమూర్తితో కలుపుకుని పలువురు మంత్రులకు ఇన్ఛార్జి అవకాశం దక్కలేదు. మంత్రుల సంఖ్య ఎక్కువ, జిల్లాల సంఖ్య 13 కావటంతో 12  మందికి అవకాశం దక్కలేదు. అదేవిధంగా లోకేష్ కూడా ఏ జిల్లాను అప్పగించలేదు. లోకేష్ ను ఏ ఒక్క జిల్లాకో పరిమితం చేయకుండా అన్నీ జిల్లాలను చూసుకునేందుకే ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించలేదని నేతలు అభిప్రాయపడుతున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios