ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా రాపూరు మండలం పెంచలకోనలో వున్న జలపాతంలో ప్రమాదవశాత్తూ గల్లంతైన 11 మంది పర్యాటకులు క్షేమంగా బయటపడ్డారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వారిని రోప్‌ల సాయంతో రక్షించారు.
ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా రాపూరు మండలం పెంచలకోనలో వున్న జలపాతంలో ప్రమాదవశాత్తూ గల్లంతైన 11 మంది పర్యాటకులు క్షేమంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వారిని రోప్‌ల సాయంతో రక్షించారు. ఎగువన కురుస్తున్న వర్షాలకు ఒక్కసారిగా వరద ప్రవాహం పెరగడంతో జలపాతంలో ఉద్దృతి పెరిగింది. దీంతో జలపాతం అందాలను వీక్షించేందుకు వెళ్లిన అయ్యప్పస్వాములు అక్కడే చిక్కుకుపోయారు. అనంతరం వీరిని రక్షించిన పోలీసులు స్వస్థలాలకు పంపినట్లుగా సమాచారం.
Also Read: Breaking News : పెంచలకోన జలపాతం వద్ద 11 మంది గల్లంతు .. రంగంలోకి సహాయ బృందాలు
కాగా.. నెల్లూరు నగరానికి 70 కిలోమీటర్ల దూరంలో వున్న పెనుశిల నరసింహస్వామి ఆలయానికి నిత్యం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు. చుట్టూ పెద్ద కొండలు, పచ్చని చెట్ల మధ్య ఉన్న పెనుశిల నరసింహ స్వామి దేవాలయం ప్రశాంతంగా వుంటుంది. ఆలయం సమీపంలో కన్వలేరు నదితో పాటు జలపాతం పర్యాటకులను ఆకర్షిస్తూ వుంటుంది. ఇక్కడ ప్రతి ఏటా ఏప్రిల్, మే నెలల్లో స్వామి వారి బ్రహ్మోత్సవాలు జరుగుతుంటాయి. కణ్వ మహర్షి ఇక్కడ తపస్సు చేశారని స్థల పురాణం చెబుతోంది.
