Asianet News TeluguAsianet News Telugu

వచ్చే ఎన్నికల్లో టిడిపి ఖర్చు రూ. 10 వేల కోట్లా ?

  • నంద్యాల ఉపఎన్నికలో టిడిపి చేసిన ఖర్చు చూసిన తర్వాత సార్వత్రిక ఎన్నికల ఖర్చుపై అంచనాలు పెరిగిపోతున్నాయ్.
  • వచ్చే ఎన్నికల్లో టిడిపి తరపున పోటీ చేయబోయే అభ్యర్ధుల ఎన్నికల ఖర్చులు సుమారు రూ. 10 వేల కోట్లని ఓ అంచనా.
  • వచ్చే ఎన్నికల్లో కోటీశ్వరులు కుడా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదు.
  • వందలు, వేల కోట్ల రూపాయల కాంట్రాక్టులు చేస్తున్న సంస్ధల అధిపతులు మాత్రమే పోటీ చేయగలరు.
  • ఎందుకంటే, ఒకవేళ ఓడిపోయినా ఎటూ వ్యాపారాలుంటాయి కాబట్టి మళ్ళీ సంపాదించుకోగలరు.
  •  
repeat of nandyal result in 2019 requires 10 thousand crore for TDP

నంద్యాల ఉపఎన్నికలో టిడిపి చేసిన ఖర్చు చూసిన తర్వాత సార్వత్రిక ఎన్నికల ఖర్చుపై అంచనాలు పెరిగిపోతున్నాయ్. వచ్చే ఎన్నికల్లో టిడిపి తరపున పోటీ చేయబోయే అభ్యర్ధుల ఎన్నికల ఖర్చులు సుమారు రూ. 10 వేల కోట్లని ఓ అంచనా. నంద్యాలలో టిడిపి తరపున సుమారు రూ. 100 కోట్లు వ్యయమైందని ప్రచారం జరుగుతోంది.

సరే, ప్రతిపక్ష వైసీపీ కుడా టిడిపి అంత కాకపోయినా అందులో సగమైనా ఖర్చు పెట్టక తప్పదు కదా? అంటే ఓ ఉపఎన్నికలో ప్రధాన పార్టీలు పెట్టిన ఖర్చు సుమారు రూ. 150 కోట్లు. ఈ లెక్కన 2019లో జరగాల్సిన సాధారణ ఎన్నికలకు ఎంత వ్యయమవుతుంది? ఇపుడీ అంశంపైనే రాజకీయ పార్టీలు అంచనాలు లెక్కలేసుకుంటున్నాయి.

మొన్నటి నంద్యాలలో గెలుపు భూమా కుటుంబంకన్నా చంద్రబాబునాయుడుకే ప్రతిష్ట. అందుకే చంద్రబాబు ఖర్చుకు ఏమాత్రం వెనకాడలేదు. పది రూపాయలు అవసరమైన చోట వందరూపాయలు ఖర్చు పెట్టిన సంగతి అందరూ చూసిందే. ఇక, కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలో కూడా అదే స్ధాయిలో ఖర్చు చేసింది. కాబట్టి వచ్చే ఎన్నికల్లో టిడిపి అదే స్ధాయిలో ఖర్చుకు సిద్దపడినట్లే అనుకోవాలి.

వందల కోట్ల రూపాయలు ఖర్చులు చేయటానికి అందరి అభ్యర్ధుల వద్ద అన్నేసి కోట్ల రూపాయలు ఉండదన్న సంగతి అందరికీ తెలిసిందే. అందుకనే ఈ విషయంలో చంద్రబాబు ముందుజాగ్రత్త పడినట్లు సమాచారం.

ఎంఎల్ఏ నియోజకవర్గాల్లోనే అంత ఖర్చు పెడితే పార్లమెంటు నియోజకవర్గాల్లో ఇంకెంత ఖర్చుంటుందో అంచనా వేసుకోవచ్చు. వచ్చే ఎన్నికల్లో కోటీశ్వరులు కుడా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదు. ఏదో స్ధిర, చరాస్తులు కలిపి సుమారు రూ. 10 కోట్లుంటుందని అనుకుంటున్న నేతలు కుడా ఎన్నికల్లో పోటీ చేయలేరు.

వందలు, వేల కోట్ల రూపాయల కాంట్రాక్టులు చేస్తున్న సంస్ధల అధిపతులు మాత్రమే పోటీ చేయగలరు. ఎందుకంటే, ఒకవేళ ఓడిపోయినా ఎటూ వ్యాపారాలుంటాయి కాబట్టి మళ్ళీ సంపాదించుకోగలరు. ఆస్తులు కుదవబెట్టో, అమ్ముకునో ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోతే నెత్తిన గుడ్డే. ఇదంతా టిడిపి తరపున పోటీ చేయబోయే అభ్యర్ధుల ఖర్చుల అంచనా మాత్రమే.

మరి టిడిపి తరపున పోటీ చేసే వారందరూ బడా కాంట్రాక్టర్లే కారు కదా? మరి వారేం చేయాలి? అటువంటి వారి విషయాన్ని చంద్రబాబే చూసుకుంటారు.  కాకపోతే పోటీ చేసే వారిలో ఎక్కువ మందిని ఖర్చుకు వెనకాడని వారినే చూసుకుంటారు. చంద్రబాబు మాత్రం డబ్బును జేబులో నుండి తీస్తారా? అందుకు ఏదో ఏర్పాటు చేసుకునే ఉంటారు.

మొన్నటి నంద్యాల ఖర్చునే ఉదాహరణగా తీసుకుంటే వచ్చే ఎన్నికల్లో టిడిపి అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్ధుల ఖర్చు మాత్రమే సుమారు రూ. 10 వేల కోట్లను దాటే అవకాశముంది. ఈ స్ధాయిలో వైసీపీ ఖర్చు పెట్టగలదా? ఎంత ఖర్చైనా పెట్టగల స్ధితిలో ఉన్నారు కాబట్టే వచ్చే ఎన్నికల్లో కూడా అధికారంపై చంద్రబాబు అంత ధీమాగా ఉన్నారు. మరి, ఓటర్లేం చేస్తారో చూడాలి?

 

 

Follow Us:
Download App:
  • android
  • ios