Asianet News TeluguAsianet News Telugu

గుంటూరులో ఎస్పీ బాల సుబ్రమహ్మణ్యం విగ్రహం తొలగింపు.. క‌ళాకారుల ఆగ్ర‌హం..

ఏపీలోని గుంటూరులో ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం విగ్రహాన్ని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తొలగించారు. దీంతో కళాకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దానిని వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. 

Removal of statue of SP bala subramanyam in Guntur .. Artists angered ..
Author
First Published Oct 4, 2022, 10:05 AM IST

ఇటీవ‌ల ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని గుంటూరులో ఏర్పాటు చేసిన ఎస్పీ బాల సుబ్రమహ్మణ్యం విగ్ర‌హాన్ని మున్సిప‌ల్ కార్పొరేష‌న్ అధికారులు తొలగించ‌డం వివాదాన్ని రేకెత్తించింది. కొంత కాలం కిందట మదర్ థెరీసా చౌర‌స్తాలో కళా దర్బార్ త‌రుఫున విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించారు. అయితే దీనికి అనుమ‌తి లేదంటూ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ సిబ్బంది దానిని అక్క‌డి నుంచి తొల‌గించారు.

వికేంద్రీకరణే రాష్ట్ర సమగ్రాభివృద్దికి ఏకైక మంత్రం: వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల

ఈ చ‌ర్య‌పై క‌ళాకారులు మున్పిస‌ల్ కార్పొరేష‌న్ ఆఫీస‌ర్ల‌పై అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. ఈ సంద‌ర్భంగా కళాదర్బార్ అధ్యక్షుడు పొత్తూరి రంగారావు మాట్లాడుతూ.. గాయ‌కుడు ఎస్పీ బాలు విగ్ర‌హం ఏర్పాటు చేసేందుకు అనుమ‌తి ఇవ్వాల‌ని రెండు సంవ‌త్స‌రాలుగా ఆఫీస‌ర్ల చుట్టూ తిరిగామ‌ని ఆయ‌న అన్నారు. త‌రువాత విగ్ర‌హాన్ని ఏర్పాటు చేశామ‌ని చెప్పారు. కానీ దానిని ఎందుకు తొల‌గించార‌ని ప్రశ్నించారు.

ప‌శువులు అక్ర‌మంగా ర‌వాణా చేస్తున్న లారీ బోల్తా.. 26 మూగ జీవాలు మృతి.. విజ‌య‌న‌గ‌రంలో ఘ‌ట‌న‌

అంత గొప్ప గాయ‌కుడైన ఎస్పీ బాల సుబ్రమహ్మణ్యంకు మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ఆఫీస‌ర్లు ఇచ్చే గౌర‌వం ఇదేనా అని అన్నారు. తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ల‌లో గుంటూరు సిటీలో మాత్ర‌మే ఎస్పీ బాలు విగ్ర‌హాన్ని ఏర్పాటు చేశార‌ని చెప్పారు. మ‌రెక్కడా లేవ‌ని అన్నారు. అయితే ఈ గుంటూరు సిటీలో దాదాపు 200పైగా అనుమ‌తి లేని విగ్ర‌హాలు ఉన్నాయ‌ని తెలిపారు. కానీ ఒక్క బాలు విగ్ర‌హాన్ని ఎందుకు తొల‌గించార‌ని ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వెంట‌నే మ‌హా గాయ‌కుడైన ఎస్పీ బాల సుబ్ర‌హ్మ‌ణ్యం విగ్ర‌హాన్ని ఏర్పాటు చేయాల‌ని డిమాండ్ చేశారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios