Asianet News TeluguAsianet News Telugu

వికేంద్రీకరణే రాష్ట్ర సమగ్రాభివృద్దికి ఏకైక మంత్రం: వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల

రాష్ట్ర సమగ్రాభివృద్దికి  వికేంద్రీకరణే ఏకైక మంత్రమని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు.  ఇవాళ పార్టీ నేతలతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వికేంద్రీకరణకు అనుకూలంగా ప్రజల అభిప్రాయాలను బలంగా విన్పించాలన్నారు. 

decentralization leads to development: YCP general secretary Sajjala Ramakrishna Reddy
Author
First Published Oct 3, 2022, 9:58 PM IST

అమరావతి: రాష్ర్ట సమగ్రాభివృధ్దికి ముఖ్యమంత్రి  వైయస్ జగన్ నిర్దేశించిన వికేంద్రీకరణ అనేదే ఏకైక మంత్రం అని వైసీపీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి  సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. పార్టీ  జిల్లా అధ్యక్షులు,శాసనసభ్యులు,నియోజకవర్గ సమన్వయకర్తలతో  సజ్జల రామకృష్ణారెడ్డి సోమవారంనాడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు..వికేంద్రీకరణకు సంబంధించినంత వరకు ప్రజావేదిక ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లు జరుగుతున్నాయన్నారు. రియల్ ఏస్టేట్ వెంచర్ లాంటి కేపిటలే అమరావతి అని ఆయన  విమర్శించారు. 

 చంద్రబాబు ఎంచుకున్న దోపీడీ మార్గానికి భిన్నంగా ముఖ్యమంత్రి  వైయస్ జగన్ మూడు రాజధానులను ప్రతిపాదించారన్నారు. భవిష్యత్తులో వేర్పాటువాదాలు తలెత్తకుండా మూడు ప్రాంతాల ప్రజల ఆకాంక్షలు నెరవేరేటట్లుగా ఆలోచన చేశారని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. 

 వికేంద్రీకరణ వల్ల రాష్ర్టం సమగ్రంగా అభివృధ్ది చెందుతుందన్నారు. దీనికి  ప్రత్యామ్నాయం లేదని నమ్ముతున్నట్టుగా ఆయన అభిప్రాయపడ్డారు.  వికేంద్రీకరణకు ప్రజలు మద్దతిస్తున్నారనేందుకు  ఎన్నికల్లో వచ్చిన పలితాలే  నిదర్శనంగా ఆయన పేర్కొన్నారు. 

గతంలోనే తిరుపతికి పాదయాత్ర చేశారన్నారు ఆ సమయంలో కూడా రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని టీడీపీపై సజ్జల విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం అరసవెల్లికి  పాదయాత్ర చేస్తున్నారన్నారు. 
 
అమరావతి పేరుతో కొందరు కృత్రిమ స్వరాన్ని వినిపిస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు.  
వికేంద్రీకరణపై ప్రజల అభిప్రాయాలను ప్రతిధ్వనించేలాగా కార్యక్రమాలను చేపట్టాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అలా చేయకపోతే కృత్రిమ స్వరం నిజమైన స్వరం అనిపించే అవకాశం ఉందని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. 

చంద్రబాబు, ఆయన ముఠా చేస్తున్న ప్రచారాన్ని సమన్వయంతో గట్టిగా తిప్పికొట్టే క్రమంలోనే రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తున్నట్టుగా సజ్జల రామకృష్ణారెడ్డి వివరించారు. వికేంద్రీకరణ ప్రజలకు అనుకూలమైందన్నారు.  ఇలాంటిఆలోచనకు బలం ఎక్కువ ఉంటుందని ఆయన ధీమాను వ్యక్తం చేశారు.

 వికేంద్రీకరణకు మద్దతు ఇచ్చే వారిని కలుపుకుని టీడీపీ దుష్ట్ప్రచారానాన్ని తిప్పికొట్టాల్సిన అవసరం ఉందన్నారు.ఈ దిశగా కార్యక్రమాలను చేపట్టాలని  సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ నేతలకు సూచించారు.  టీడీపీ ఆలోచనను  ప్రజలపై బలవంతంగా రుద్దడం సరైంది కాదనే అభిప్రాయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ నేతలను కోరారు. వికేంద్రీకరణకు మద్దతుగా  దసరా రోజున దేవాలయాల్లో ప్రత్యేకంగా పూజలు నిర్వహించాలన్నారు. చంద్రబాబు మనసు మారాలని దుర్గమ్మను కోరాలన్నారు. 

వికేంద్రీకరణలో అమరావతి ఉండాలనే నినాదంగా ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. అమరావతికి  తాము వ్యతిరేకం కాదని ఆయన స్పష్టం చేశారు.  ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో హైద్రాబాద్ లోనే  అభివృద్ది కేంద్రీకృతం కావడంతో అసమానతలు పెరిగిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 

భవిష్యత్తులో  వేర్పాటు ఉద్యమాలు జరగకుండా ఉండాలంటే వికేంద్రీకరణే మార్గమన్నారు. వికేంద్రీకరణే రాష్ర్ట అభివృధ్దికి తారకమంత్రమన్నారు. వికేంద్రీకరణే అభ్యుదయానికి తొలిమెట్టనే  ధ్యేయంతో ముందుకు వెళ్లాలని ఆయన పార్టీ నేతలను కోరారు.

Follow Us:
Download App:
  • android
  • ios