Asianet News TeluguAsianet News Telugu

సీఐపై దాడి: టీడీపీ నేతలకు హైకోర్టులో ఊరట.. పోలీసులకు న్యాయస్థానం కీలక ఆదేశాలు

టీడీపీ కార్యాలయాలపై దాడి తర్వాత దారి తీసిన పరిణామాలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ నేతలు  ఆలపాటి రాజేంద్రప్రసాద్ (alapati rajendra prasad), అశోక్ బాబు (paruchuri ashok babu), శ్రవణ్ కుమార్‌‌లకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది

relief to tdp leaders in ap high court over attack on ci naik at telugu desam party head office
Author
Amaravati, First Published Oct 26, 2021, 1:49 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

టీడీపీ కార్యాలయాలపై దాడి తర్వాత దారి తీసిన పరిణామాలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ నేతలకు హైకోర్టులో (ap high court) ఊరట కలిగింది. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి సమయంలో సీఐ నాయక్‌పై (ci Naik) దాడిపై టీడీపీ నేతలు ఆలపాటి రాజేంద్రప్రసాద్ (alapati rajendra prasad), అశోక్ బాబు (paruchuri ashok babu), శ్రవణ్ కుమార్‌ల (shravan kumar)పై కేసు నమోదు చేశారు పోలీసులు. దీనిపై వీరు హైకోర్టును ఆశ్రయించడంతో ముందుగా 41ఏ నోటీసు ఇచ్చి విచారణ జరపాలని న్యాయస్థానం పోలీసులను ఆదేశించింది. 

కాగా, గత మంగళవారం దాడి జరిగిన టీడీపీ జాతీయ కార్యాలయానికి స్థానిక సీఐ నాయక్ వెళ్ళగా అక్కడే వున్న nara lokesh ఆయనను అడ్డుకునే ప్రయత్నం చేసారని పోలీసులు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే లోకేష్ సహా అక్కడున్నవారు సీఐపై దాడికి తెగబడ్డారని... వారి నుండి తప్పించుకున్న సీఐ ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు హత్యాయత్నం కేసు నమోదు చేసారు. ఈ కేసులో లోకేష్ ను ఏ1గా పేర్కొన్న పోలీసులు ఎ2 అశోక్ బాబు, ఎ3 అలపాటి రాజా, ఎ4 తెనాలి శ్రవణ్ కుమార్. ఎ5 పోతినేని శ్రీనివాస రావు గా పేర్కొన్నారు. వీరితో పాటు మరికొందరు టీడీపీ నేతలపై కూడా కేసులు నమోదయ్యాయి. 

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై (Ys jagan) టీడీపీ (tdp) నేత కొమ్మారెడ్డి పట్టాభి (kommareddy pattabhi) చేసిన వ్యాఖ్యలు ఎంతటి కలకలం రేపాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రధానంగా ముఖ్యమంత్రిని ఉద్దేశిస్తూ 'బోసడీకే'... అన్నపదం ఏపీలో ఇప్పుడు అత్యంత చర్చనీయాంశమైంది. టీడీపీ నేత పట్టాభి గత మంగళవారం మధ్యాహ్నం ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ... ముఖ్యమంత్రి జగన్‌ని ఈ పదాన్ని ఉపయోగిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాతనే వైసీపీ కేడర్ భగ్గుమంది. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ కార్యాలయాలు, నేతల ఇళ్లపై అధికార పార్టీ కార్యకర్తలు దాడులకు పాల్పడటం తెలిసిందే. వైసీపీ దాడులను నిరసిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (chandrababu naidu) 36 గంటల పాటు నిరసన దీక్ష చేశారు. దీనికి కౌంటర్‌గా వైసీపీ సైతం జనాగ్రహ దీక్షలకు దిగింది. 

Also Read:AP Bandh: పోలీస్ అధికారిపై దాడి... నారా లోకేష్ పై హత్యాయత్నం కేసు

కాగా.. మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో తాజాగా మరో ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. దాంతో ఈ కేసులో అరెస్టయిన వారి సంఖ్య 16కి చేరింది. దాడి ఘటన నిందితులను పట్టుకునేందుకు పోలీసులు 4 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. మీడియా క్లిప్పింగ్స్ ఆధారంగా ఈ కేసులో నిందితులను పోలీసులు గుర్తించారు. తాజాగా అరెస్టయిన వారిలో కె. మోహన్ కృష్ణారెడ్డి, కాండ్రుకుంట గురవయ్య గుంటూరుకు చెందినవారు కాగా.... షేక్ బాబు, షేక్ సైదా, బంకా సూర్య సురేశ్, జోగరాజు విజయవాడకు చెందినవారు. ఈ కేసులో మిగతా నిందితుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. 

ఈ నెల 19న టీడీపీ ఆఫీసుతో పాటు ఆ పార్టీ నేత పట్టాభి ఇంటిపై వైసీపీ నేతల దాడికి సంబంధించి అరెస్ట్‌ల పర్వం  మొదలైంది. రెండు దాడులకు సంబంధించి విడివిడిగా కేసులు నమోదు చేస్తున్నారు పోలీసులు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో తొలుత పది మందిని గుంటూరు అర్బన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక పట్టాభి ఇంటిపై దాడికి సంబంధించి 11 మందిని అరెస్ట్ చేశారు విజయవాడ పోలీసులు. 

Follow Us:
Download App:
  • android
  • ios