అమరావతి అసైన్డ్ భూముల కేసు.. చంద్రబాబు, నారాయణలకు ఊరట..!
రాజధాని అసైన్డ్‌భూముల వ్యవహారంలో వైసీపీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిబ్రవరి 24న ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సీఐడీ పోలీసులు చంద్రబాఋ, నారాయణలపై ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టంతోపాటు ఏపీ అసైన్డ్ భూముల చట్టం, ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అసైన్డ్ భూముల వ్యవహారంలో.. టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణలకు కాస్త ఊరట లభించింది. చంద్రబాబు, నారాయణలపై సీఐడీ నమోదు చేసిన కేసులో దర్యాప్తుతో పాటు.. విచారణకు సంబంధించి తదుపరి చర్యలను నిలిపివేస్తూ.. గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు మరో 8 వారాలు పొడిగించింది.
Also Read: విజయనగరం జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం.. పేలుతున్న గ్యాస్ సిలిండర్లు, 20 పూరిళ్లు దగ్ధం
తదుపరి విచారణను 4వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ డి.రమేశ్ శుక్రవారం ఆదేశాలిచ్చారు. రాజధాని అసైన్డ్‌భూముల వ్యవహారంలో వైసీపీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిబ్రవరి 24న ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సీఐడీ పోలీసులు చంద్రబాఋ, నారాయణలపై ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టంతోపాటు ఏపీ అసైన్డ్ భూముల చట్టం, ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
Also Read: ఏపీ: ఇప్పటి వరకు ఎన్ని ఎయిడెడ్ విద్యాసంస్థలు విలీనమయ్యాయంటే.. విద్యాశాఖ మెమో
ఈ కేసులను కొట్టివేయాలని కోరుతూ ఇరువురూ హైకోర్టును ఆశ్రయించారు. వారి వ్యాజ్యాలపై న్యాయస్థానం మార్చి 19న విచారణ జరిపి.. సీఐడీ నమోదు చేసిన కేసులపై స్టే విధించింది. ఈ వ్యాజ్యాలు శుక్రవారం మరోసారి విచారణకు వచ్చాయి. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. మధ్యంతర ఉత్తర్వుల గడువు ముగుస్తున్న నేపఽథ్యంలో పొడిగించాలని కోరారు. ఆ వాదనలు పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి సదరు ఉత్తర్వులను మరో ఎనిమిది వారాలకు పొడిగించారు.