పవన్ కల్యాణ్ మెడలోది రెడ్ టవల్ కాదు: షకలక శంకర్ ఆసక్తికరం

పవన్ కల్యాణ్ మెడలోది రెడ్ టవల్ కాదు: షకలక శంకర్ ఆసక్తికరం

హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కల్యాణ్ మెడలో వేసుకునే రెడ్ టవల్ పై జబర్దస్త్ ఫేమ్ షకలక శంకర్ ఆసక్తికరమైన సమాధానం ఇచ్చాడు. పవన్ కల్యాణ్ అంటే షకలక శంకర్ కు ఎనలేని అభిమానం. ఆయనపై ప్రత్యేకమైన స్కిట్స్ చేశాడు. 

పవన్ కల్యాణ్ మెడలో వేసుకునే రెడ్ టవల్ పై షకలక శంకర్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓ వెబ్ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఆ వ్యాఖ్యలు చేశారు.  "పవన్ మెడలో ఉండే రెడ్ టవల్ దేన్ని సూచిస్తుందని యాంకర్ అడిగితే -  అది రెడ్ టవల్ కాదండి... అదో విప్లవ చిహ్నమని జవాబిచ్చాడు. 

అది పవన్ మెడలో, నుదుట ఉంటుందని, అది ఉంటే విజయం ఖాయమని అన్నారు. అదే సగం బలమని, తాను కూడా వాడుతుంటానని అన్నారు. దాన్ని వాడుకొనే వాడికి హక్కు, శక్తి ఉండాలని అన్నారు 

పవన్‌తో సినిమాలు చేయడానికి మీరు సిద్ధమేనా అని మరో ప్రశ్న వేస్తే పవన్ కల్యాణ్ సీఎం అవుతుంటే ఇంకేం సినిమాలు చేస్తారని ఎదురు ప్రశ్న వేశారు. పవన్ కల్యాణ్ సీఎం అవుతారని, సీఎం  అయిన తర్వాత పీఎం అవుతారని షకలక శంకర్ అన్నారు.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM Andhra Pradesh

Next page