Asianet News TeluguAsianet News Telugu

వచ్చే ఎన్నికల్లో మా పార్టీకి దక్కేది 5 స్థానాలే.. జగన్ గెలుస్తాడో లేదో.. పులివెందుల దక్కుతుందో లేదో.. : రఘురామ

వచ్చే ఎన్నికల్లో ప్రజలు తమ పార్టీకి 5 స్థానాలే కట్ట బెడతారని.. జగన్ చెప్పిన కర్మ సిద్దాంతం నిజమైతే అదే జరుగుతుందని రఘురామ ఎద్దేవా చేశారు. 

Rebel MP Raghuramakrishnam Raju sensational comments on ys jagan, ycp - bsb
Author
First Published Mar 24, 2023, 8:09 AM IST

ఢిల్లీ : వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు తమ పార్టీ మీద మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్మ సిద్ధాంతం కనక నిజమైతే వచ్చే ఎన్నికల్లో తమ పార్టీకి ఐదు సీట్లు మాత్రమే దక్కుతాయని జోస్యం చెప్పారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీకి చెందిన 23 మంది శాసనసభ్యులను టిడిపి తమ పార్టీలో చేర్చుకుంది. దీనివల్లే టీడీపీకి శాసనసభ ఎన్నికల్లో 23 స్థానాలనే ప్రజలు కట్టబెట్టారని సీఎం వైఎస్ జగన్ అప్పుడు కర్మ సిద్ధాంతాన్ని చెప్పారు. అయితే, ఆయన అప్పుడు చెప్పిన ఈ కర్మ సిద్ధాంతం నిజమైతే.. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీకి ఐదు స్థానాలు మాత్రమే దక్కుతాయని రఘురామకృష్ణంరాజు అన్నారు. 
దీంతోపాటు జగన్ గెలుస్తాడో లేదో అన్న అనుమానాన్ని కూడా వ్యక్తపరిచాడు. ఆ గెలిచే ఐదు స్థానాల్లో కూడా పులివెందుల ఉంటుందో లేదో?.. జగన్ ఎమ్మెల్యేగా గెలుస్తాడో లేదో?  అన్నది అనుమానమేనని చెప్పకొచ్చారు.

గురువారం ఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల ఫలితాల్లో విజయం సాధించిన తర్వాత టిడిపి నాయకులు పులివెందుల మీద దృష్టి సారిస్తున్నారని.. వై నాట్ పులివెందుల అని నినదిస్తున్నారని అన్నారు. గతంలో గెలిచిన తర్వాత జగన్ జనసేన తరఫున గెలిచిన ఒకే ఒక ఎమ్మెల్యేను..  టిడిపి నుంచి గెలిచిన నలుగురిని అధికార వైసీపీలో చేర్చుకున్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.  

ప్రలోభాలతో గెలిచింది గెలుపా .. క్రాస్ ఓటింగ్‌కు పాల్పడింది ఎవరో తేలుస్తాం : సజ్జల రామకృష్ణారెడ్డి

ఈ చేర్చుకున్న దానిమీద కనీసం ఏమాత్రం  సిగ్గు లేకుండా సాక్షి దినపత్రికలో ఐదుగురు ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకున్నట్లుగా రాసుకున్నారని విమర్శలు గుప్పించారు.  ఎన్నికలు రాబోతున్న తరుణంలో 25 కు 25 ఎంపీ స్థానాలు ప్రతిపక్షాలకు దక్కే అవకాశాలు ఉన్నాయని అన్నారు. తమ అధికార పత్రిక అయిన సాక్షిలో.. శాసనసభలో బలం లేకపోయినా టిడిపి అభ్యర్థిని బరిలోకి దించిందని రాసుకున్నారని, ఇది విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు. 23 మంది ఎమ్మెల్యేలు టిడిపి నుంచి ఎన్నికల్లో విజయం సాధించారని..  ఇక కేవలం 22 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంటే ఎమ్మెల్సీగా గెలవడానికి చాలని  చెప్పుకొచ్చారు. 

జగన్ విలువల గురించి చాలా మాట్లాడతారని..  తాను పుట్టిన తర్వాతే విలువలు పుట్టాయి అన్నట్లుగా మాట్లాడతారని ఎద్దేవా చేశారు. ఇంత మాట్లాడే జగన్ టిడిపి నుంచి వైసీపీలోకి చేరిన నలుగురు ఎమ్మెల్యేల మీద అనర్హత చర్యలకు సిఫార్సు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా 22 మంది ఎమ్మెల్యేకు ఒక క్యాంపు చొప్పున నిర్వహించారని.. ఎమ్మెల్యేలు అందరికీ ఇలా తమ సింహం (వైఎస్ జగన్) క్యాంపులు నిర్వహించాల్సి రావడం అత్యంత దురదృష్టకరమైన పరిస్థితి అని ముఖ్యమంత్రి ఉద్దేశించి రఘురామ కృష్ణంరాజు వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. 

పార్టీ శాసనసభ్యులను కనుసైగతోనే శాసిస్తారని పేరు ఉన్న ముఖ్యమంత్రికి ఎంత కష్టం వచ్చింది అంటూ ఎద్దేవా చేశారు.  మంత్రులకు ఎమ్మెల్యేల క్యాంపు బాధ్యతలను అప్పగించిన తర్వాత కూడా ఎమ్మెల్యేలను కాపాడుకోవాల్సిన దుస్థితి ముఖ్యమంత్రికి ఏర్పడిందంటే ఆలోచించాలని… ప్రజల్లో పార్టీ పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చని అన్నారు.  అంతేకాదు..  వై నాట్ 175 అని తమ పార్టీ చేస్తున్న నినాదాన్ని ప్రజలు నమ్మడం లేదని చెప్పుకొచ్చారు. 

Follow Us:
Download App:
  • android
  • ios