అమరావతి: రిటైర్డ్ ఐపీఎస్ అధికారి వీవీ లక్ష్మీనారాయణకు జనసేన  చీఫ్  పవన్ కళ్యాణ్‌ కు మధ్య అగాధం ఎందుకు పెరిగిందనే ప్రచారం సర్వత్రా చర్చ సాగుతోంది. చివరి నిమిషంలో  జనసేనలో చేరి విశాఖపట్టణం ఎంపీ స్థానానికి లక్ష్మీనారాయణ పోటీ చేసి గణనీయమైన ఓట్లను సాధించాడు. బీజేపీలో చేరుతారనే ప్రచారాన్ని లక్ష్మీనారాయణ ఖండించారు.

రిటైర్డ్ ఐపీఎస్ అధికారి వీవీ లక్ష్మీనారాయణకు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌కు మద్య గ్యాప్ రావడానికి స్వచ్ఛంధ సంస్థ కారణంగా ప్రచారం సాగుతోంది. జేడీ లక్ష్మీనారాయణ తన స్వంత స్వచ్ఛంధ సంస్థ ద్వారా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఎన్నికల తర్వాత కూడ లక్ష్మీనారాయణ కూడ కొన్ని కార్యక్రమాలను నిర్వహించారు.ఈ కార్యక్రమాల్లో జనసేనకు చెందిన సానుభూతిపరులు పార్టీ కార్యకర్తల సేవలను ఉపయోగించుకొన్నారనే ప్రచారం ఉంది. ఈ కారణంగానే జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ లక్ష్మీనారాయణకు మధ్య అగాధం పెరిగిందని చెబుతున్నారు. కానీ, ప్రచారాన్ని లక్ష్మీనారాయణ సన్నిహితులు కొట్టిపారేస్తున్నారు.

మరో వైపు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌ను కలవడానికి సాధారణ కార్యకర్తగా ఎదురుచూడాల్సిన పరిస్థితులు ఉండడంపై లక్ష్మీనారాయణ కొంత అసంతృప్తితో ఉన్నారనే ప్రచారం కూడ ఉంది.  ఈ కారణంగానే పవన్ కళ్యాణ్ ను కలిసేందుకు లక్ష్మీనారాయణ ముందుకు రావడం లేదని అంటున్నారు ఆయన సన్నిహితులు.

జనసేన  కమిటీల్లో జేడీ లక్ష్మీనారాయణకు స్థానం దక్కలేదు. దీంతో జేడీ లక్ష్మీనారాయణకు పవన్ కళ్యాణ్ కు మధ్య అగాధం ఉందనే ప్రచారం సాగుతోంది. బీజేపీలో చేరేందుకు కూడ లక్ష్మీనారాయణ ఆ పార్టీ నేతలతో టచ్‌లోకి వెళ్లారని ప్రచారం కూడ సాగింది. 

జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌కు మాజీ ఐపీఎస్ అధికారి వీవీ లక్ష్మీనారాయణకు మధ్య గ్యాప్ ఎందుకు వచ్చిందనే విషయమై స్పష్టత లేదు. తమ మధ్య ఎలాంటి గ్యాప్ లేదని ఇద్దరు నేతలు కూడ పార్టీ నేతల వద్ద స్పష్టం చేసినట్టుగా సమాచారం.

తనకు వ్యతిరేకంగా కొందరు పార్టీ మారుతారని  ప్రచారం చేస్తున్నారని లక్ష్మీనారాయణ ట్విట్టర్ వేదికగా కూడ శనివారం నాడు ప్రకటించారు. ఎన్నికలకు ముందు లక్ష్మీనారాయణ టీడీపీలో చేరుతారని ప్రచారం కూడ సాగింది. కానీ ఆయన జనసేన తీర్థం పుచ్చుకొన్నారు.

సంబంధిత వార్తలు

జనసేనతోనే ఉంటా, అదంంతా గిట్టనివాళ్ల ప్రచారం: సీబీఐ మాజీ జేడీ స్ట్రాంగ్ వార్నింగ్

పవన్ కి షాక్... బీజేపీలోకి మాజీ జేడీ లక్ష్మి నారాయణ