విశాఖపట్నం: జనసేన పార్టీకి గుడ్ బై చెప్తున్నారంటూ వస్తున్న వార్తలపై స్పందించారు సీబీఐ మాజీ జేడీ వివి లక్ష్మీనారాయణ. అవగాహన రాహిత్యంతో, ఇష్టానుసారంగా రాసే మీడియా వార్తలకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. 

శనివారం ఉదయం నుంచి తనపై వస్తున్న వార్తలను చూసి షాక్ కు గురైనట్లు తెలిపారు. తాను అంటే గిట్టని వాళ్లు ఇలాంటి వార్తలను ప్రచారం చేస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. మూర్ఖులు మాత్రమే ఇలాంటి వార్తలను ప్రచారం చేస్తారంటూ విరుచుకుపడ్డారు.  

ప్రజా సమస్యలపై, అన్యాయాలపై జరిగే పోరాటాన్ని ఇలాంటి తప్పుడు వార్తలు ప్రభావితం చేయలేవంటూ స్ట్రాంగ్ వార్నింగ్ సైతం ఇచ్చేశారు. తాను జనసేన పార్టీకి ఉపయోగపడుతున్నానని అధినేత పవన్ కళ్యాణ్ భావించే వరకు తాను జనసేనతోనే ఉంటానని తేల్చి చెప్పారు. 

దయచేసి ఇలాంటి పుకార్ల కోసం సమయం వృథా చేయవద్దని హితవు పలికారు. సమయం ఉంటే వరద బాధితవారికి సహాయం చేయడానికి, మొక్కలు నాటడానికో ఉపయోగించాలని సూచించారు.  ప్లాస్టిక్ నిర్మూలన, రోడ్ల శుభ్రత వంటి అంశాలపై యువతను ప్రేరేపించేలా పనిచేయాలని వీవీ లక్ష్మీనారాయణ స్పస్టం చేశారు.

ఈ వార్తలు కూడా చదవండి

పవన్ కి షాక్... బీజేపీలోకి మాజీ జేడీ లక్ష్మి నారాయణ