వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.

అమరావతి: వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. అన్న గాలి జనార్దన్ రెడ్డి కోసం తమ్ముడు జగన్ సొంత జిల్లాకు వెన్నుపోటు పొడిచారని ఆయన అన్నారు.

బీజేపీ, వైసీపీ జెండాలు వేరైనా ఎజెండా ఒక్కటే అని ఆయన అన్నారు. బీజేపీ, వైసీపీలు క్విడ్‌ ప్రో కోకు కేరాఫ్‌ అడ్రస్ అని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో విమర్శించారు. 

కర్ణాటక ఎన్నికల్లో గాలి జనార్ధన్‌రెడ్డి అందించిన ఆర్థిక సాయానికి కడప స్టీల్‌ప్లాంట్‌ను బహుమానంగా ఇచ్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని అన్నారు. విభజన హామీలపై బీజేపీ నేతలు ప్రజాక్షేత్రంలో మాట్లాడాలని ఆయన డిమాండ్ చేశారు.