అమరావతి : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మళ్లీ సీఎం కావాలన్నదే తన కోరిక అని స్పష్టం చేశారు నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు. చంద్రబాబు మళ్లీ సీఎం కావాలని ఆకాంక్షిస్తూ చండీ, ఐత మహా సుదర్శన యాగాలను విజయవంతంగా నిర్వహించారు రాయపాటి. 

యాగాలు పూర్తి చేసుకున్న అనంతరం బుధవారం సీఎం చంద్రబాబును రాయపాటి కలిశారు. చండీ, ఐత మహా సుదర్శన యాగాల విశేషాలను బాబుకు వివరించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. 

యాగాల పరిసమాప్తి సందర్భంగా పూర్ణాహుతి అనంతరం వేదపండితులు నుంచి స్వీకరించిన శేష వస్త్రాన్ని సైతం చంద్రబాబుకు రాయపాటి సాంబశివరావు అందజేశారు. ఇకపోతే చంద్రబాబు సీఎం కావాలని కోరుతూ గుంటూరు జిల్లా మాచవరం మండలం మోర్జంపాడులో బుగ్గ మల్లేశ్వరస్వామి దేవాలయంలో ఐదు రోజులపాటు రాయపాటి సాంబశివరావు చండీ, ఐత మహాసుదర్శన యాగాలు చేసిన విషయం తెలిసిందే.