ఆనందయ్య మందు బ్లాక్ మార్కెటింగ్: రూ. 20 వేలతో నాగరాజు అనే వ్యక్తి పరారీ, పోలీసులకు ఫిర్యాదు

 నెల్లూరు జిల్లా కృష్ణపట్టణానికి చెందిన  ఆనందయ్య మందును కొందరు కేటుగాళ్లు బ్లాక్ మార్కెట్‌లో విక్రయిస్తూ సొమ్ము చేసుకొంటున్నారు.హైద్రాబాద్ నగరంలో ఈ మందు పేరుతో నాగరాజు అనే వ్యక్తి రూ. 20 వేలు తీసుకొని పారిపోయాడు. ఈ విషయమై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 
 

Ravi complaints against Nagaraju for anandayya ayurvedic medicine lns

హైదరాబాద్: నెల్లూరు జిల్లా కృష్ణపట్టణానికి చెందిన  ఆనందయ్య మందును కొందరు కేటుగాళ్లు బ్లాక్ మార్కెట్‌లో విక్రయిస్తూ సొమ్ము చేసుకొంటున్నారు.హైద్రాబాద్ నగరంలో ఈ మందు పేరుతో నాగరాజు అనే వ్యక్తి రూ. 20 వేలు తీసుకొని పారిపోయాడు. ఈ విషయమై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

నెల్లూరు కృష్ణపట్టణానికి చెందిన ఆనందయ్య  అందిస్తున్న మందు కరోనాను తగ్గిస్తోందనే ప్రచారం సాగింది. దీంతో పెద్ద ఎత్తున ఈ మందు కోసం కరోనా బాధితులు కృష్ణపట్టణానికి వస్తున్నారు.  అయితే ఈ నెల 21వ తేదీ నుండి  ఆనందయ్య మాత్రం మందు పంపిణీని నిలిపివేశారు. ఆనందయ్య తయారు చేస్తున్న మందును ఆయుర్వేద జాతీయ పరిశోధన సంస్థ పరిశోధిస్తోంది. 

ఈ  మందు కోసం హైద్రాబాద్ కు చెందిన రవి అనే వ్యక్తి కృష్ణపట్టణానికి చెందిన  నాగరాజు అనే వ్యక్తిని పోన్ లో సంప్రదించాడు. ఈ మందుకు రూ.50 వేలు ఇవ్వాలని నాగరాజు డిమాండ్ చేశారు. చివరకు రూ. 35 వేలకు బేరం కుదిరింది. రవి బందువులకు కరోనా సోకడంతో ఈ మందు వాడితే ఉపయోగం ఉంటుందని భావించిన రవి  నాగరాజును సంప్రదించాడు.

అయితే ఆనందయ్య ఈ మందును ఉచితంగా పంపిణీ చేస్తున్నాడు. అయితే  ఉచితంగా ఇచ్చే మందుకు ఇంత డబ్బులు ఎందుకు ఇవ్వాలని రవి స్నేహితుడు సాయి నాగరాజును ప్రశ్నించాడు.  ఈ విషయమై వాగ్వాదం చోటు చేసుకొంది. రవి వద్ద నుండి రూ. 20 వేలను తీసుకొని నాగరాజు పారిపోయాడు.ఈ విషయమై నాగరాజుపై రవి ఫిర్యాదు చేశాడు. తన మందు పేరుతో కొందరు బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్నారని ఆనందయ్య నెల్లూరులో సోమవారం నాడు ప్రకటించారు.ఈ విషయమై అప్రమత్తంగా ఉండాలని  ఆయన కోరారు.


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios