పందికొక్కుల వల్ల అనంతపురం ప్రాజక్టుకు గండి

rats cause  breach to ananatapurs pendekallu project
Highlights

నాసిరకం పనులా, పందికొక్కులా , ఏది కారణం?

ఉధృతంగా కురుస్తున్న వర్షాల  వల్ల అనంతపురం జిల్లా పెండెకల్లు ప్రాజక్టుకు గండి పడింది. వానలొస్తేనే గండి పడిందా? కాదు, అసలు కారణం పందికొక్కులంటున్నారు ఇంజనీర్లు. అనంతపురం సమీపంలోని పెద్దపప్పూరు పరిధిలో ఉన్న ఈ ప్రాజక్టును కొత్త గా నిర్మించారు. ఇంకా డిపార్ట్ మెంటుకుఅప్పచెప్పనేలేదు. అయితే,  ఇపుడు కురుస్తున్న వర్షాల వల్ల ఆనకట్టకు ఒక చోట గండిపడిందని  ఇదికేవలం నాసిరకం పనులే దీనికి కారణమని  రెవిన్యూ అధికారుల అనుమానం. ఇపుడు గండిపూడ్చేపనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టారు. జాయింట్ కలెక్టర్ రమామణి స్వయంగా పర్యవేక్షిస్తూ గండిపూడ్చేపనులు చేపట్టారు.మంగళవారం గండిపడి నీరు సంకేసుల పల్లి వైపు  ప్రవహిస్తూ ఉండటాన్ని గ్రామస్థులు గమనించి రెవిన్యూ, పోలీసు అధికారులకు సమాచారం అందించారు.  అనంతరం ప్రాజక్టు రెండు గేట్లు ఎత్తి నీటిని పెన్నానదిలోకి వదిలేశారు. దీనితోగ్రామస్తులు ముంపు ప్రమాదం తప్పించుకున్నారని అధికారులు చెప్పారు.  ఈ విషయం తెలుసుకున్న కలెక్టర్ వీరపాండ్యన్ కూడా వచ్చి ప్రాజక్టు ను పరిశీలించారు. అయితే, పందికొక్కులు తవ్వడం వల్ల ఒక బొరియ ఏర్పడిందని,అదే గండికి కారణమయిందని  ప్రాజక్టు ఇంజనీర్లు అంటున్నారు. నాసిరకం పనులను కప్పిపుచ్చుకునేందుకు నేరాన్ని పందికొక్కుల మీదకు నెడుతున్నారా? అసలు విషయం దర్యాప్తులో గాని తేలదు.

 

loader