ఏలూరులో దారుణ ఘటన వెలుగు చూసింది. ఆత్మహత్య చేసుకుని చనిపోయిన ఓ మహిళ మృతదేమాన్ని ఎలుకలు కొరికాయి. చింతలపూడి ప్రభుత్వాసుపత్రిలో ఈ ఘటన వెలుగు చూసింది. 

ఏలూరు : ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరు జిల్లా చింతలపూడి ప్రభుత్వాసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. రెండు రోజుల క్రితం మృతి చెందిన ఓ మహిళ మృతదేహాన్ని ఎలుకలు కొరికేశాయి. గురువారం ఉదయం కృష్ణవేణి అనే మహిళ ఉరివేసుకొని మృతి చెందింది. కాగా, వెంటనే చింతలపూడి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. 

కాగా మృతదేహానికి పోస్టు మార్టం చేయడానికి అక్కడి సిబ్బంది రూ. 2000 వేలు డిమాండ్ చేశారు. మృతురాలి కుటుంబ సభ్యులు ఇచ్చుకోలేకపోవడంతో.. పోస్టుమార్టం చేయలేదు. ఆస్పత్రిలోనే ఉన్న కృష్ణవేణి మృతదేహాన్ని ఎలుకలు కొరికాయి. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.