ఆవనిగడ్డ పంటకాలువలోకి దూసుకెళ్లిన కారు: రత్నభాస్కర్ కోసం గాలింపు
ఉమ్మడి కృష్ణా జిల్లాలోని ఆవనిగడ్డ కరకట్ట పంట కాలువలో కారు బోల్తా పడింది. ఈ కారులో ప్రయాణించిన రత్నభాస్కర్ కన్పించకుండా పోయాడు.
విజయవాడ: ఉమ్మడి కృష్ణా జిల్లాలోని ఆవనిగడ్డ కరకట్ట పంట కాలువలో కారు బోల్తా పడింది.ఈ ప్రమాదంలో కారులో ప్రయాణీస్తున్న రత్నభాస్కర్ అనే వ్యక్తి గల్లంతైనట్టుగా అనుమానిస్తున్నారు. ఆవనిగడ్డకు చెందిన రత్నభాస్కర్ ఐస్ ఫ్యాక్టరీ నిర్వహిస్తున్నాడు. ఆదివారంనాడు రాత్రి మచిలీపట్టణం నుండి బంటుమిల్లి వస్తున్నట్టుగా కుటుంబ సభ్యులకు రత్న భాస్కర్ సమాచారం ఇచ్చాడు. అయితే రాత్రి ఇంటికి రాలేదు.
దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆవనిగడ్డ వద్ద పంట కాలువలో కారును గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ కారును రత్న భాస్కర్ కారుగా గుర్తించారు పోలీసులు. కాలువ నుండి కారును వెలికి తీశారు. అయితే కారులో మాత్రం రత్నభాస్కర్ లేడు. కారులో రత్నభాస్కర్ ఫోన్ ను పోలీసులు గుర్తించారు. రత్న భాస్కర్ ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాలువలో రత్నభాస్కర్ కాలువలో పడిపోయాడా, లేదా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.