అరసవెల్లి ఆలయంలో రథ సప్తమి వేడుకలు: భారీగా తరలి వచ్చిన భక్తులు


శ్రీకాకుళం జిల్లా అరసవెల్లి ఆలయంలో రథ సప్తమి వేడుకలు మంగళవారం నాడు ప్రారంభమయ్యాయి. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు భక్తులు ఆలయం వద్ద బారులు తీరారు.

Ratha Saptami celebrations begins at Suryadev temple in Arasavalli

శ్రీకాకుళం: జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం Arasavalli  సూర్యనారాయణ స్వామి ఆలయంలో Ratha Saptami వేడుకలు మంగళవారం నాడు వైభవంగా ప్రారంభమయ్యాయి.  ఏపీ అసెంబ్లీ స్పీకర్ Tammineni seetharam,. ఏపీ డిప్యూటీ సీఎం Dharmana krishna Das లు ఇవాళ ఉదయం స్వామివారిని దర్శించుకొన్నారు.  రథసప్తమిని పురస్కరించుకొని ఇవాళ ఉదయం నుండే స్వామిని దర్శించుకొనేందుకు భక్తులు ఆలయం వద్ద బారులు తీరారు.వీఐపీల కోసం ఆలయ అధికారులకు ప్రాధాన్యత ఇవ్వడంతో సామాన్య devotees  ఇబ్బందులు పడ్డారు. 

అరసవల్లిలో సూర్య జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు.. మాఘశుద్ధ సప్తమి రోజున అరసవల్లి క్షేత్రంలో కొలువైన సూర్యనారాయణస్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు.. రథసప్తమి వేడుక సందర్భంగా పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. సుమారు 600 మంది సిబ్బంది విధులు నిర్వర్తించనున్నారు.

స్వామి దర్శనం కోసం భక్తులు అధిక సంఖ్యలో రానున్న నేపథ్యంలో ఆలయ అధికారులు  కోవిడ్ ప్రోటోకాల్ పాటించాలని కోరారు. ఈ మేరకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఉచిత దర్శనంతో పాటు, రూ.100, రూ.500 టిక్కెట్లు విక్రయింస్తున్నారు.  వివిధ ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికుల సౌకర్యార్థం ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు.

 ఇవాళ అర్థరాత్రి 12 గంటల 15 నిమిషాలకు ప్రారంభమైన క్షీరాభిషేక మహోత్సవం 8వ తేదీ ఉదయం 7 గంటల వరకు జరుగుతుంది. అనంతరం విశేష అర్చనలు, ద్వాదశ హారతి, మహా నివేదన, పుష్పాలంకరణ సేవలు ఉంటాయి. 8వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు స్వామి వారి నిజరూప దర్శనం భక్తులకు కనువిందు చేయనుంది.

సాయంత్రం 6 గంటలకు విశేష అర్చన ఉంటుంది. 8వ తేదీ రాత్రి 11 గంటల నుండి స్వామి వారికి ఏకాంత సేవ నిర్వహిస్తారు.  32 సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. 80 ఫీట్ రోడ్డులో భక్తులకు పార్కింగ్ సదుపాయం కల్పించారు.

అర్ధరాత్రి తర్వాత స్వామివారి జయంతి ఉత్సవానికి అంకురార్పణ చేశారు. ముందుగా వేదపారాయణతో ఆదిత్యుని మూల విరాట్టుకు క్షీరాభిషేకం నిర్వహించి త్రిచ, సౌరం, అరుణం, నమకం, చమకాలతో అభిషేకం నిర్వహించారు. 

అనంతరం నదీ జలాలు, పంచామృతాలతో స్వామివారికి అభిషేకం నిర్వహించి సుప్రభాతం, నిత్యార్ఛన, ద్వాదశి అర్చనలతో స్వామివారికి ప్రత్యేక సేవలు చేశారు.. మంగళవారం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు భక్తులకు స్వామివారి నిజరూప దర్శనం దక్కింది. అనంతరం పుష్పాలంకరణ సేవ నిర్వహించారు.. మంగళవారం రాత్రి ఏకాంత సేవతో రథసప్తమి వేడుకలు ముగుస్తాయి. రథ సప్తమి ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు. వేడుకలకు లక్ష మంది భక్తులు హాజరవుతారని అంచనా వేశారు.

కోవిడ్ నేపధ్యంలో క్యూ లైన్స్, థర్మల్ స్కాన్, శానిటైజర్లు ఏర్పాటు చేశారు. కార్పొరేషన్ పరిధిలో ప్రత్యేక పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశారు. . రథసప్తమి వేడుకల సందర్భంగా శ్రీకాకుళం పట్టణంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. ట్రాఫిక్‌ను మూడు రూట్లుగా విభజించారు. నరసన్న పేట నుంచి వచ్చే భక్తులు రామలక్ష్మణ జంక్షన్ నుంచి సంతోషి మాత టెంపుల్ మీదుగా రావాలని సూచించారు. నవ భారరత్ నుంచి వచ్చే వారు ఏడు రోడ్ల జంక్షన్ మీదుగా, గార వైపు నుంచి వచ్చే వాహనాలను రెడ్డి పేట దగ్గర పార్కింగ్ ఏర్పాట్లు చేశారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios