ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలో 12 శతాబ్దం నాటి అరుదైన‌ గణపతి విగ్రహం లభ్యమైంది.

అప్పుడప్పుడు పురాతన వస్తువులు, దశాబ్దాల నాటి శిలలు, విగ్ర‌హాలు బయట పడుతూ ఉంటాయి. అవి
అలనాటి చరిత్ర, సంస్కృతిని మ‌న‌కు తెలుపుతాయి. తాజాగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో అద్భుతం చోటు చేసుకుంది. పల్నాడు జిల్లాలోని మాచర్ల పట్టణంలో 12 శతాబ్దం నాటి అరుదైన‌ గణపతి విగ్రహం లభ్యమైంది.

ఈ పురాతన విగ్రహం ఇప్పుడు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఆ కాలంలోనే గణపతినే ఎక్కువగా పూజేంచేవారని.. అప్పుడు గణపతి విగ్రహాలన్నీ దాదాపు ఇదే రూపంలో ఉండేవని అర్థమవుతోంది. తాజాగా.. పల్నాడు జిల్లాలోని మాచర్ల పట్టణంలోని ప్రసిద్ధ చెన్నకేశవ ఆలయంలో గణేశుడు పోరాట భంగిమలో ఉన్న అరుదైన విగ్ర‌హం వెలుగులోకి వ‌చ్చింది. 

ఈ సంద‌ర్భంగా.. పురావస్తు శాస్త్రవేత్త, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో ఇ.శివనాగిరెడ్డి మాట్లాడుతూ.. మాచ‌ర్ల పట్టణంలో నిర్వ‌హించిన స‌ర్వేలో 12 శతాబ్దం నాటి అదురైన‌ గణేశుడి విగ్ర‌హాన్ని గుర్తించినట్టు తెలిపారు. ప్రసిద్ధ చెన్నకేశవ ఆలయంలోని రంగమండప స్తంభం మధ్య భాగంలో గ‌ణేశుడి పోరాట విగ్ర‌హం ప్ర‌తిమ ఉన్న‌ట్లు తెలిపారు. వినాయ‌క‌ పురాణంలో పేర్కొన్న విధంగా గణేశుడు ఓ రాక్ష‌సుడితో పోరాటం చేస్తున్న‌ట్టు, ఈ విగ్ర‌హంలో వినాయ‌కుడు ఒక్క‌ చేతిలో గొడ్డలి, మ‌రో చేతితో కొర‌డ‌ పట్టుకొట్టు ఉన్నాడు. మరో రెండు చేతులతో రాక్ష‌సుడితో పోరాడుతున్న‌ట్టు ఈ విగ్ర‌హంలో క‌నిపిస్తుంది. 

అలాగే.. నల్గొండ జిల్లాలోని పాన్‌గల్‌లోని పచ్చల సోమేశ్వరాలయం, పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని రామాలయంలో కూడా 12వ శతాబ్దం నాటి సమకాలీనమైన మరో రెండు శిల్పాలు లభించాయని ఆయన చెప్పారు. మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ కూడా అరుదైన గణేశుడి శిల్పాన్ని పరిశీలించారు . 

ఆలయ ప్రాంగణం లోపల ఐకానోగ్రాఫిక్, చారిత్రక వివరాలతో కూడిన లెజెండ్ బోర్డును ఏర్పాటు చేయాలని ఆలయ అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ అవగాహన కార్యక్రమంలో పండిట్ బెజ్జంకి జగన్నాధాచార్యులు, పావులూరి సతీష్‌బాబు(చరిత్రకారుడు) దుర్గికి చెందిన శిల్పి చెన్నుపాటి శ్రీనివాసాచార్యులు పాల్గొన్నారు.