విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహిళా రోగిపై ఓ వ్యక్తి లైంగిక దాడికి యత్నించాడు.

విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహిళా రోగిపై ఓ వ్యక్తి లైంగిక దాడికి యత్నించాడు. అయితే ఇది గమనించిన తోటి రోగులు, ఆస్పత్రి సిబ్బంది అతడి చర్యను అడ్డుకన్నారు. ఈ ఘటనపై మహిళా బంధువులు మాచవరం పోలీసులకు ఫిర్యాదు. మహిళపై లైంగిక దాడికి యత్నించిన వ్యక్తిని గుంటూరుకు చెందిన చంద్రశేఖర్ గా గుర్తించారు. నిందితుడు చంద్రశేఖర్‌పై ఐపీసీ 354 సెక్షన్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

Also Read: పట్టపగలే నడిరోడ్డుపై బాలికపై అత్యాచార యత్నం.. అడిగిన తల్లిదండ్రులపై దాడి...

మరోవైపు ఈ ఘటన తర్వాత ఆస్పత్రి సిబ్బంది అప్రమత్తం అయ్యారు. ప్రస్తుతం బాధిత మహిళకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి నిందితుడు చంద్రశేఖర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితురాలు బంధువులు డిమాండ్ చేస్తున్నారు.