తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే షాకింగ్ కామెంట్స్ చేశారు.
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే షాకింగ్ కామెంట్స్ చేశారు. ఎన్డీఎ నుంచి వైదొలిగే విషయంలో చంద్రబాబు తొందరపడ్డారని ఆయన అన్నారు. చంద్రబాబు ఎన్డీఎలో కొనసాగి ఉంటే ప్రత్యేక హోదాపై ప్రధాని నరేంద్ర మోడీ సానుకూలంగా స్పందించి ఉండేవారని ఆయన అన్నారు.
జగన్‌ను తాము ఎన్డీయేలోకి ఆహ్వానిస్తున్నామని, తమతో కలిస్తే జగన్ సీఎం అయ్యేందుకు సహకరిస్తామని ఆయన చెప్పారు. ప్రత్యేక హోదా విషయంలో మోడీ, అమిత్‌షాలతో తాను మాట్లాడతానని చెప్పారు.
తన హైదరాబాద్ పర్యటనలో అథవాలే శనివారం ఈ వ్యాఖ్యలు చేశారు. రాహుల్‌పై వ్యంగ్యస్త్రాలు విసిరారు. రాజ్యాంగాన్ని తానూ, మోడీ రక్షిస్తామని, కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీ రక్షించుకోవాలని సలహా ఇచ్చారు.
