Rajanagaram assembly elections result 2024 : రాజానగరం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 LIVE
Rajanagaram assembly elections result 2024 live : తూర్పు గోదావరి జిల్లాలోని రాజానగరం నియోజకవర్గ ఎమ్మెల్యేగా జక్కంపూడి రాజా కొనసాగుతున్నారు. వరుసగా రెండుసార్లు (2009, 2014) ప్రాతినిధ్యం వహించిన పెందుర్తి వెంకటేష్ ను ఓడించారు జక్కంపూడి. ఇలా వైసిపి, టిడిపి నువ్వా నేనా అన్నట్లున్న రాజానగరం రాజకీయాల్లోకి జనసేన ఎంటర్ అయ్యింది. పొత్తులో భాగంగా ఈసారి రాజానగరం బరిలో జనసేన నిలిచింది.
Rajanagaram assembly elections result 2024 live : 2008 లో చేపట్టిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా రాజానగరం అసెంబ్లీ ఎర్పాటయ్యింది. ఈ నియోజకవర్గంలో 2009లో మొదటిసారి అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా టిడిపి విజయం సాధించింది. ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత 2014 లో జరిగిన ఎన్నికల్లోనూ టిడిపి సత్తా చాటింది. వరుసగా రెండుసార్లు పెందుర్తి వెంకటేష్ ఎమ్మెల్యేగా గెలిచారు.
ఇలా టిడిపి బలంగా వున్న రాజానగరంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసిపి జెండా ఎగిరింది. 2019 ఎన్నికల్లో జక్కంపూడి రాజా రాజానగరం ఎమ్మెల్యేగా గెలిచారు. గత ఐదేళ్లలో వైసిపి కూడా రాజానగరంలో బలంగా మారింది. కాబట్టి ఈసారి కూడా ఇక్కడ హోరాహోరీ పోరు సాగనుంది.
రాజానగరం నియోజకవర్గ పరిధిలోని మండలాలు :
1. సీతానగరం
2. కోరుకొండ
3. రాజానగరం
రాజానగరం అసెంబ్లీ ఓటర్లు :
నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య (2019 ఎన్నికల ప్రకారం) - 2,01,260
పురుషులు - 99,943
మహిళలు - 1,01,309
రాజానగరం అసెంబ్లీ ఎన్నికలు 2024 అభ్యర్థులు :
వైసిపి అభ్యర్థి :
రాజానగరం అసెంబ్లీ బరిలో సిట్టింగ్ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా నిలిచే అవకాశాలున్నారు. ఆయన అభ్యర్థిత్వాన్ని వైసిపి ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.
జనసేన అభ్యర్థి :
టిడిపి, జనసేన, బిజెపి కూటమి అభ్యర్థిగా బత్తుల బలరామకృష్ణ రాజానగరంలో పోటీ చేస్తున్నారు. పొత్తులో భాగంగా ఈ సీటు జనసేనకు దక్కింది.
రాజానగరం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ;
రాజానగరం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024
రాజానగరం నియోజకవర్గంలో జనసేన పార్టీ గెలుపొందింది. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి జక్కంపూడి రాజాపై జనసేన అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో బత్తుల బలరామకృష్ణ 1,05,995 (55.51%) ఓట్లు సాధించగా.. జక్కంపూడి రాజా 71,946 (37.68 %) ఓట్లు సాధించారు.
రాజానగరం అసెంబ్లీ ఎన్నికలు 2019 ఫలితాలు :
నియోజకవర్గంలో పోలయిన మొత్తం ఓట్లు - 1,76,785
వైసిపి - జక్కంపూడి రాజా - 90,680 (51 శాతం) - 31,772 ఓట్ల మెజారిటీతో ఘన విజయం
టిడిపి - పెందుర్తి వెంకటేష్ - 58,908 (33 శాతం) - ఓటమి
జనసేన పార్టీ - రాయపురెడ్డి ప్రసాద్ - 20,847 (11 శాతం)
రాజానగరం అసెంబ్లీ ఎన్నికలు 2014 ఫలితాలు :
నియోజకవర్గంలో పోలయిన మొత్తం ఓట్లు - 1,60,757 (85 శాతం)
టిడిపి - పెందుర్తి వెంకటేష్ - 81,476 (50 శాతం) - 8,887 ఓట్ల మెజారిటీతో విజయం
వైసిపి - జె విజయలక్ష్మి - 82,589 (45 శాతం) - ఓటమి
- Andhra Pradesh Assembly Elections 2024
- Andhra Pradesh Elections 2024
- Battula Balaramakrishna
- JSP
- Jakkampudi Raja
- Janasena Party
- Nara Chandrababu Naidu
- Pawan Kalyan
- Pendurthi Venkatesh
- Rajanagaram Politics
- Rajanagaram assembly elections result 2024
- TDP
- TDP Janasena Alliance
- Telugu Desam party
- Telugu News
- YS Jaganmohan Reddy
- YSR Congress Party
- YSRCP