రాజంపేటలో ఏ పార్టీ గెలిస్తే.. ఆ పార్టీయే రాష్ట్రంలో అధికారంలో వుంటుందనే సెంటిమెంట్ ప్రజల్లోనూ, రాజకీయ పార్టీల్లోనూ బలంగా వుంది. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా వున్న రాజంపేటలో తర్వాత వైసీపీ పాగా వేసింది. టీడీపీ ఆవిర్భావం తర్వాత కేవలం రెండు సార్లు మాత్రమే రాజంపేటలో గెలిచింది. 1984లో, 1999లో మాత్రమే ఆ పార్టీ గెలుపు రుచి చూసింది. వైఎస్ జగన్‌కు అత్యంత సన్నిహితుడు కావడంతో పాటు పెద్దిరెడ్డి వ్యూహాలు, బలమైన కేడర్ వుండటంతో మిథున్ రెడ్డి ఢీకొట్టడం అంత ఆషామాషీ కాదు. టీడీపీ విషయానికి వస్తే.. ఆ పార్టీ ఇక్కడ గెలిచి దాదాపు పాతికేళ్లు గడుస్తోంది. కాపులు, శెట్టిబలిజ, తెలగ సామాజికవర్గాల ప్రాబల్యం ఎక్కువగా వుండటం, టీడీపీతో పొత్తు తమకు కలిసొస్తుందని జనసేన భావిస్తోంది.
రాయలసీమలో..అందులోనూ కడపకు కూతవేటు దూరంలో వుండే రాజంపేట లోక్‌సభ నియోజకవర్గంలో రాజకీయాలు విభిన్నంగా సాగుతాయి. అందుకే రాజంపేటను అంచనా వేయడం అంత ఈజీ కాదు. రెడ్ల ఆధిపత్యం వుండే ఈ ప్రాంతంలో కాపులే రాజంపేట నుంచి ఎంపీలుగా గెలుస్తూ వుండటం గమనార్హం. ప్రతీ ఎన్నికల్లోనూ ఇక్కడ నువ్వా , నేనా అన్నట్లుగా రాజకీయాలు సాగుతాయి. రాజంపేటలో ఏ పార్టీ గెలిస్తే.. ఆ పార్టీయే రాష్ట్రంలో అధికారంలో వుంటుందనే సెంటిమెంట్ ప్రజల్లోనూ, రాజకీయ పార్టీల్లోనూ బలంగా వుంది. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా వున్న రాజంపేటలో తర్వాత వైసీపీ పాగా వేసింది. టీడీపీ ఆవిర్భావం తర్వాత కేవలం రెండు సార్లు మాత్రమే రాజంపేటలో గెలిచింది. 1984లో, 1999లో మాత్రమే ఆ పార్టీ గెలుపు రుచి చూసింది.
రాజంపేట ఎంపీ (లోక్‌సభ) ఎన్నికల ఫలితాలు 2024.. పెద్దిరెడ్డి కుటుంబానిదే ఆధిపత్యం :
1957లో రాజంపేట లోక్‌సభ నియోజకవర్గం ఏర్పడగా.. కాంగ్రెస్ పార్టీ 11 సార్లు, టీడీపీ రెండు సార్లు, వైసీపీ రెండు సార్లు, ఇతరులు రెండు సార్లు విజయం సాధించారు. రాజంపేట లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో రాజంపేట, కోడూరు, రాయచోటి, తంబళ్లపల్లి,పీలేరు, మదనపల్లె, పుంగనూరు అసెంబ్లీ స్థానాలున్నాయి. రాజంపేటలో మొత్తం ఓటర్లు 15,46,938 మంది. వీరిలో పురుషులు 7,79,621 మంది, మహిళలు 7,67,156 మంది. 2019 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా 12,24,354 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోగా.. 79.15 శాతం పోలింగ్ నమోదైంది. 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో రాజంపేట పరిధిలోని ఏడు శాసనసభ స్థానాలను వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. నాటి పార్లమెంట్ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి మిథున్ రెడ్డికి 7,02,211 ఓట్లు.. టీడీపీ అభ్యర్ధి డీఏ సత్యప్రభకు 4,33,927 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా వైసీపీ 2,68,284 ఓట్ల మెజారిటీతో రాజంపేటను సొంతం చేసుకుంది.
రాజంపేట ఎంపీ (పార్లమెంట్) ఎన్నికల ఫలితాలు 2024 .. టీడీపీ గెలిచి పాతికేళ్లు :
రాజంపేట లోక్‌సభ నియోజకవర్గం వైసీపీకి కంచుకోటగా మారింది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు ఇక్కడ ఆధిపత్యం చెలాయిస్తున్నారు. ఆయన కుమారుడు మిథున్ రెడ్డి వరుసగా రెండు సార్లు ఎంపీగా విజయం సాధించారు. ఈసారి కూడా ఆయనే వైసీపీ నుంచి ఎంపీ అభ్యర్ధిగా బరిలోకి దిగుతున్నారు. వైఎస్ జగన్‌కు అత్యంత సన్నిహితుడు కావడంతో పాటు పెద్దిరెడ్డి వ్యూహాలు, బలమైన కేడర్ వుండటంతో మిథున్ రెడ్డి ఢీకొట్టడం అంత ఆషామాషీ కాదు.
టీడీపీ విషయానికి వస్తే.. ఆ పార్టీ ఇక్కడ గెలిచి దాదాపు పాతికేళ్లు గడుస్తోంది. అయితే ఈసారి రాజంపేట ఎంపీ టికెట్ కోసం పార్టీలో ఆశావహులు భారీగా వున్నారు. వ్యాపారవేత్త గంటా నరహరితో పాటు మాజీ ఎంపీ సుగవాసి పాలకొండ్రాయుడు కుమారుడు బాలసుబ్రమణ్యం , లక్కిరెడ్డిపల్లె మాజీ ఎమ్మెల్యే రమేశ్ రెడ్డి ఈ టికెట్ ఆశిస్తున్నారు.
రాజంపేట లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2024.. బరిలో నిలిచేదెవరు :
జనసేనతో పొత్తు నేపథ్యంలో ఆ పార్టీ కూడా రాజంపేటను కోరుతోంది. కాపులు, శెట్టిబలిజ, తెలగ సామాజికవర్గాల ప్రాబల్యం ఎక్కువగా వుండటం, టీడీపీతో పొత్తు తమకు కలిసొస్తుందని జనసేన భావిస్తోంది. బీజేపీ నుంచి మాజీ కేంద్ర మంత్రి సాయిప్రతాప్ అల్లుడు సాయి లోకేష్ బరిలో నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కూడా రాజంపేట ఎంపీ బరిలో నిలవాలని భావిస్తున్నారట. ఇక్కడ గెలిచి తన చిరకాల ప్రత్యర్ధి పెద్దిరెడ్డి కుటుంబానికి షాకివ్వాలని ఆయన పావులు కదుపుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.