రాజంపేట అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024

కాపు, శెట్టి బలిజ, తెలగ కమ్యూనిటీలు రాజంపేటలో ఆధిపత్య వర్గాలు. ఈ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో సిద్ధవటం, ఒంటిమిట్ట, నందలూరు, రాజంపేట, వీరబల్లె, టీ సుండుపల్లి మండలాలున్నాయి.  

Rajampet Assembly elections result 2024 AKP

కడపకు కూతవేటు దూరంలో వుండే రాజంపేట రాజకీయంగా చాలా హాట్ నియోజకవర్గం. దట్టమైన నల్లమల అడవులతో పాటు అపారమైన ఖనిజ సంపదకు , ప్రకృతి రమణీయతకు ఈ నియోజకవర్గం కేంద్రం. 1952లో నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి రాజంపేట కాంగ్రెస్‌కు కంచుకోట. ఇక్కడ కాంగ్రెస్ ఏడు సార్లు, టీడీపీ 4 సార్లు, స్వతంత్రులు మూడు సార్లు, వైసీపీ రెండు సార్లు, సీపీఐ అభ్యర్ధి ఒకసారి విజయం సాధించారు. ఈసారి టిడిపి హవాలో కూడా వైసిపి విజయం సాధించంది.  అకెపాటి అమర్నాథ్ రెడ్డి  7,016 స్వల్ప మెజారిటీతో టిడిపి అభ్యర్థి బాల సుబ్రహ్మణ్య సుగవాసిపై విజయం సాధించారు.      

రాజంపేటలో కాపులదే ఆధిపత్యం :

కాంగ్రెస్ సీనియర్ నేత, మహిళా నేత ప్రభావతమ్మ నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందడం విశేషం. టీడీపీ నేత పసుపులేటి బ్రహ్మయ్య ఎన్టీఆర్ కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. కాపు, శెట్టి బలిజ, తెలగ కమ్యూనిటీలు రాజంపేటలో ఆధిపత్యం వహిస్తున్నాయి. ఈ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో సిద్ధవటం, ఒంటిమిట్ట, నందలూరు, రాజంపేట, వీరబల్లె, టీ సుండుపల్లి మండలాలున్నాయి. రాజంపేటలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,37,191 మంది. వీరిలో పురుషులు 1,15,751 మంది.. మహిళలు 1,21,430 మంది. 

రాజంపేట రాజకీీయాలు :

2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి మేడా మల్లిఖార్జున రెడ్డికి 95,266 ఓట్లు.. బత్యాల చెంగల్రాయుడు 59,994 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా వైసీపీ అభ్యర్ధి 35,272 ఓట్ల మెజారిటీతో రాజంపేటలో విజయం సాధించారు. 2024 ఎన్నికల విషయానికి వస్తే.. సిట్టింగ్ ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున రెడ్డికి జగన్ టికెట్ నిరాకరించారు. ఆయనకు బదులుగా ఆకేపాటి అమర్‌నాథ్‌ రెడ్డిని అభ్యర్ధిగా బరిలోకి దిగారు. తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుని టిడిపి కూటమి అభ్యర్థిపై విజయం సాధించారు. 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios