విభజనతో తెలుగు తల్లి కన్నీరు కారుస్తోంది: మురళీమోహన్

First Published 2, Jun 2018, 3:45 PM IST
Rajahumundry MP Murali Mohan slams on   Bjp
Highlights

తెలుగు తల్లి కన్నీళ్ళు

రాజమండ్రి: ఏపీ రాష్ట్రానికి కేంద్రం  చేసిన  అన్యాయంతో
తెలుగుతల్లి కన్నీళ్ళు పెడుతుందని రాజమండ్రి ఎంపీ
మురళీమోహన్ అభిప్రాయపడ్డారు.ఉమ్మడి ఏపీ రాష్ట్రాన్ని
విభజించి తెలుగుతల్లిని ముక్కలు చేశారని ఆయన ఆవేదన
వ్యక్తం చేశారు.

 నవనిర్మాణదీక్షలో భాగంగా రాజమండ్రిలో ఆయన
మాటలాడారు. ఎన్నికల ముందు  కేంద్రం ఇచ్చిన హమీలను
విస్మరించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

తెలుగు తల్లి కళ్ళలో ఆనందబాష్పలు రావాల్సిన అవసరం
ఉందన్నారు. ఈ మేరకు ప్రతి ఒక్కరూ కసిగా పనిచేయాల్సిన
అవసరం ఉందన్నారు.

కేంద్రం అన్యాయం చేసినందునే ఎన్డీఏ నుండి బయటకు
వచ్చినట్టు ఆయన చెప్పారు. 

వచ్చే ఎన్నికల్లో బిజెపికి తగిన బుద్ది చెప్పాల్సిన అవసరం
ఉందని ఆయన చెప్పారు. ఉమ్మడి ఏపీ రాష్ట్రాన్ని విభజించి
తెలుగు తల్లిని ముక్కలు చేశారని మురళీమోహన్ చెప్పారు. 


నవనిర్మాణ దీక్షలతో అభివృద్దికి పునరంకితం కావాల్సిన
అవసరం ఉందన్నారు మురళీమోహన్.

loader