తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఓ ప్రైవేట్ హాస్పిటల్ వద్ద.. వైసిపి సిటి కోఆర్డినేటర్ ఆకుల సత్యనారాయణ అత్యుత్సాహం ప్రదర్శించాడు. స్థానిక ఆదిత్య హస్పిటల్ వద్ద ఓ మహిళపై నోరు జారాడు. 

"

ప్రైవేట్ ఆస్పత్రుల్లో డబ్బులు లేకుండా ఎవ్వడూ వైద్యం చేయడంటూ వీరంగం సృష్టించాడు.  డబ్బులు కట్టినా ఆక్సిజన్ లేకపోతే ఎలా అని ప్రశ్నించిన మహిళ పై ఆకుల సీరియస్ అయ్యాడు.నోరు ముయ్యి.. నీ డబ్బులు నీకు పడేస్తాం.. రూపాయికి పది రూపాయిలు పడేస్తానని ఫైర్.. అయ్యాడు.

అంతేకాదు ఆదిత్య హాస్పిటల్ నుంచి బాధితుడిని దయచేసి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లండంటూ ఉచిత సలహా ఇచ్చాడు. ఆక్సిజన్ అందడం లేదని అడిగినందుకు ఆదిత్య ఆస్పత్రి యాజమాన్యానికి మద్దతునిస్తూ బాధిత కుటుంబ సభ్యులపై ఆకుల సత్యనారాయణ మండిపడ్డాడు.

ఆకుల సత్యనారాయణ వ్యవహారశైలిపై ఇప్పటికే పలు విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఘటన మరింత ప్రాముఖ్యం సంతరించుకుంది. మీడియాని పిలిపించి గవర్నమెంట్ ను అడగాలంటూ తనపై మండి పడ్డారని బాధిత మహిళ కన్నీటి పర్యంతమయ్యింది.