రాజమండ్రి రూరల్ లో టీడీపీ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య గెలుపు
Rajahmundry Rural assembly elections result 2024 live : తెలుగుదేశం పార్టీ విజయాల ఖాతా తెరిచింది. రాజమండ్రి రూరల్ అసెంబ్లీలో టిడిపి అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి విజయం సాధించారు. అలాగే రాజమండ్రి సిటీలో టిడిపి అభ్యర్థి ఆదిరెడ్డి వాసు విజయం సాధించారు. 63,056 ఓట్ల మెజారిటీతో గోరంట్ల విజయం సాధించారు.
Rajahmundry Rural assembly elections result 2024 live : రాజమండ్రి రూరల్ రాజకీయాలు :
రాజమండ్రి రూరల్ సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి ఇప్పటికే వరుసగా రెండుసార్లు (2014, 2019) గెలిచి సత్తా చాటారు. అయితే ఇక్కడ జనసేన పార్టీ కూడా బలంగా వుండటం... రెండు పార్టీల మధ్య పొత్తు కుదరడంతో ఈ సీటు ఎవరికి దక్కుతుందన్న సందిగ్దత ఏర్పడింది. అయితే గోరంట్ల కోసం జనసేన రాజమండ్రి రూరల్ సీటును త్యాగం చేయాల్సివచ్చింది. ఈ సీటును ఆశించిన కందుల దుర్గేష్ నిడదవోలుకు షిఫ్ట్ అయ్యేందుకు ఒప్పుకోవడంతో గోరంట్లకు లైన్ క్లియర్ అయ్యింది.
ఇక వైసిపిలోనూ ఇలాంటి పరిస్థితే నెలకొంది. రాజమండ్రి రూరల్ సీటును పలువురు వైసిపి నేతలు ఆశించినా ఆ పార్టీ అదిష్టానం మాత్రం అక్కడ బలమైన నేతను బరిలోకి దింపేందుకు సిద్దమయ్యింది. దీంతో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణను రాజమండ్రి రూరల్ అభ్యర్థిగా ఎంపికచేసింది.
రాజమండ్రి రూరల్ నియోజకవర్గ పరిధిలోని మండలాలు :
1. రాజమండ్రి రూరల్ మండలం
2. కడియం
3. రాజమండ్రి మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని 1 నుండి 6, 36 నుండి 41 మరియు 90 వార్డులు
రాజమండ్రి రూరల్ అసెంబ్లీ ఓటర్లు :
నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య (2019 ఎన్నికల ప్రకారం) - 2,54,432
పురుషులు - 1,24,760
మహిళలు - 1,29,660
రాజమండ్రి రూరల్ అసెంబ్లీ ఎన్నికలు 2024 అభ్యర్థులు :
వైసిపి అభ్యర్థి :
మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణను రాజమండ్రి రూరల్ బరిలోకి దింపింది వైసిపి. ఆయన ప్రస్తుతం రామచంద్రాపురం సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొనసాగుతుండగా అక్కడినుండి రాజమండ్రి రూరల్ కు మార్చింది వైసిపి అదిష్టానం.
టిడిపి అభ్యర్థి :
ఇక టిడిపి-జనసేన కూటమి నుంచి టిడిపి సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పోటీ చేశారు.
రాజమండ్రి రూరల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ;
రాజమండ్రి రూరల్ అసెంబ్లీ ఎన్నికలు 2019 ఫలితాలు :
నియోజకవర్గంలో పోలయిన మొత్తం ఓట్లు - 1,87,725
టిడిపి - గోర్లంట్ల బుచ్చయ్యచౌదరి - 74,166 (39 శాతం) - 10,404 ఓట్ల మెజారిటీతో గెలుపు
వైసిపి - ఆకుల వీర్రాజు - 63,762 (33 శాతం) - ఓటమి
జనసేన పార్టీ - కందుల దుర్గేష్ - 42,685
(22 శాతం)
రాజమండ్రి రూరల్ అసెంబ్లీ ఎన్నికలు 2014 ఫలితాలు :
నియోజకవర్గంలో పోలయిన మొత్తం ఓట్లు - 1,67,626 (73 శాతం)
టిడిపి - గోర్లంట్ల బుచ్చయ్య చౌదరి - 87,540 (52 శాతం) - 18,058 ఓట్ల మెజారిటీతో విజయం
వైసిపి - ఆకుల వీర్రాజు - 50,000 (41 శాతం) - ఓటమి
రాజమండ్రి రూరల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024
తెలుగుదేశం పార్టీ విజయాల ఖాతా తెరిచింది. రాజమండ్రి రూరల్ అసెంబ్లీలో టిడిపి అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి 63,056 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. గోరంట్ల బుచ్చయ్యచౌదరి ఇప్పటికే వరుసగా రెండుసార్లు (2014, 2019) గెలిచి సత్తా చాటారు.
- Andhra Pradesh Assembly Elections 2024
- Andhra Pradesh Elections 2024
- Chelluboina Venugopal Krishna
- Gorantla Butchaiah Chowdary
- JSP
- Janasena Party
- Kandula Durgesh
- Nara Chandrababu Naidu
- Pawan Kalyan
- Rahahmundry Politics
- Rajahmundry Rural assembly elections result 2024
- TDP
- TDP Janasena Alliance
- Telugu Desam party
- Telugu News
- YS Jaganmohan Reddy
- YSR Congress Party
- YSRCP