ఏపీ రాజధాని అమరావతిలోని తాత్కాలిక అసెంబ్లీ భవనం నిర్మాణంలో లోపాలు మరోసారి బయటకు వచ్చాయి. వెలగపూడిలోని అసెంబ్లీ భవనంలోని ప్రతిపక్షనేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఛాంబర్‌లోకి మరోసారి వర్షపు నీరు వచ్చింది.

పెథాతుఫాన్ ప్రభావంయ్ తో రెండు రోజుల నుంచి రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో తాత్కాలిక అసెంబ్లీ భవనం కూడా భారీ వర్షానికి తడిసి ముద్దయ్యింది. దీంతో జగన్ ఛాంబర్‌లోకి పైకప్పు నుంచి వర్షపు నీరు వచ్చి చేరింది.

ఈ ఏడాది మే నెలలోనూ, అంతకు ముందు కూడా పలుమార్లు కురిసిన చిన్నపాటి వర్షానికి జగన్ కార్యాలయంలోకి నీరు ప్రవేశించడం అప్పట్లో దుమారాన్ని రేపింది. మరోసారి వర్షపు నీరు ప్రతిపక్షనేత ఛాంబర్‌లోకి రావడంతో అసెంబ్లీ తాత్కాలిక భవనాల నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.