విజయనగరంలో చంద్రబాబు సభ.. కూలిన టెంట్లు

rain effect for cm chandrababu meeting
Highlights

సీఎం సభకు వర్షం దెబ్బ

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సభకు వర్షం దెబ్బ తగిలింది. ప్రస్తుతం చంద్రబాబు విజయనగరం జిల్లాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా శృంగవరపు కోటలో ఆయన ఆధ్వర్యంలో ప్రత్యేక సభ నిర్వహించారు.  ఈ సభలో జగన్.. ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.

కాగా.. ఈ సభ జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా వర్షం పడింది. ఇటీవలే రాష్ట్రంలోని రుతుపవనాలు అడుగుపెట్టాయి. ఈ నేపథ్యంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సభా ప్రాంగణం దగ్గర వర్షం ధాటికి టెంట్లు కూలాయి. ప్రమాదకర స్థాయిలో ఈదురు గాలులు, భారీ వర్షం కురుస్తోంది. ఈదురు గాలులతో అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. సీఎంకు రక్షణ వలయంగా ప్రత్యేక బలగాలు నిలిచాయి.
 
విజయనగరం జిల్లాలో చంద్రబాబు పర్యటిస్తున్న విషయం తెలిసిందే. సోమవారం ఉదయం లక్కవరపుకోట మండలం జమ్మాదేవిపేట గ్రామంలో వీధుల్లో తిరిగి ప్రజల సమస్యలను బాబు అడిగి తెలుసుకున్నారు. జమ్మాదేవిపేటలో రచ్చబండ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆంధ్రులను ప్రధాని మోదీ నమ్మించి మోసం చేశారని, వైసీపీ ఎంపీల రాజీనామాల డ్రామాను ప్రజలు అర్ధం చేసుకున్నారని చంద్రబాబు చెప్పారు.

loader