కిరాతకంగా కాళ్లు, చేతులు నరికి భర్తని కిడ్నాప్‌

First Published 26, May 2018, 10:04 AM IST
railway employee kidnaped east godavari
Highlights

కిరాతకంగా కాళ్లు, చేతులు నరికి భర్తని కిడ్నాప్‌  

శుక్రవారం అర్థరాత్రి పిఠాపురం గోపాలబాబ ఆశ్రమం వద్ద కొంతమంది దుండగులు దంపతులపై దాడి చేశారు. ముమ్మడి సుబ్రమణ్యం అనే వ్యక్తి అతని భార్య సుబ్బలక్ష్మి నిద్రిస్తున్న సమయంలో దుండగులు నేరుగా ఇంట్లోకి వెళ్లి వారిపై స్ప్రే కొట్టారు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురంలో చోటుచేసుకుంది.

అనంతరం దుండగులు సుబ్బలక్ష్మి కాళ్లు, చేతులు అతి కిరాతకంగా నరికి, సుబ్రమణ్యంని కిడ్నాప్‌ చేశారు. మత్తులో ఉన్న సబ్బలక్ష్మికి స్పృహలోకి వచ్చిన తరువాత ఘటన వెలుగులోకి వచ్చింది. స్థానికులు బాధితురాలిని కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

loader