విజయవాడ: రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీతోను పొత్తు పెట్టుకోదని ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి స్పష్టం చేశారు. టీడీపీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటుందన్నవార్తలపై స్పందించిన రఘువీరా 2019 ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామన్నారు. 

ఒంటరిగానే అయినా అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని తేల్చి చెప్పారు. సెప్టెంబర్ 18న కర్నూల్ లో జరిగే కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభకు జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వస్తారని తెలిపారు. డిసెంబర్ నుంచి ప్రతీ నెలలో రాహుల్ గాంధీ పర్యటన ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. మరోవైపు రాఫెల్ స్కాంపై వచ్చే నెలలో రాష్ట్రస్థాయి ఆందోళన చేపడతామని తెలిపారు.

ఈ వార్తలు కూడా చదవండి

కాంగ్రెస్‌తో పొత్తుపై మంత్రి అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు