Asianet News TeluguAsianet News Telugu

ఏపీలో వరద బీభత్సం: సహాయక కార్యక్రమాల్లో పాల్గొనండి .. కాంగ్రెస్ శ్రేణులకు రాహుల్ సూచన

ఏపీలో భారీ వర్షాలు, వరదలపై కాంగ్రెస్ (congress party) అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ (rahul gandhi) స్పందించారు. అక్కడి పరిస్థితులపై ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలంతా సహాయ చర్యల్లో పాల్గొనాలని ఆయన సూచించారు.

rahul gandhi instructs congress workers to help flood affected areas in ap
Author
New Delhi, First Published Nov 21, 2021, 2:29 PM IST

ఏపీలో భారీ వర్షాలు, వరదలపై కాంగ్రెస్ (congress party) అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ (rahul gandhi) స్పందించారు. అక్కడి పరిస్థితులపై ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలంతా సహాయ చర్యల్లో పాల్గొనాలని ఆయన సూచించారు. ఆంధ్రప్రదేశ్ లో వరదలు (floods in ap) పెను విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయని, తీరని నష్టాన్ని మిగుల్చుతున్నాయని రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మీయులను కోల్పోయిన వారికి సానుభూతిని తెలియజేశారు. కాగా.. గడిచిన మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల ధాటికి నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లో భారీ వరదలు ముంచెత్తాయి. ఇప్పటి వరకు 20 మందికిపైగా చనిపోయారు. నదులు కట్టలు తెంచుకుని ప్రవహిస్తుండటంతో వందలాది గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. 

ముఖ్యంగా కడప జిల్లాను (kadapa district) భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. జిల్లాలోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాలన్నీ నీటిలో మునిగిపోయాయి. నీటిలో ఉన్నభవనాలు కుప్పకూలిపోతున్నాయిత.రెండు రోజులుగా కడప జిల్లాలో కురుస్తున్న వర్షాల కారణంగా పాపాగ్ని నదిపై (papagni river) ఉన్న వంతెన కుప్పకూలింది. కమలాపురం, వల్లూరు  మార్గ మధ్యలోని వంతెన అర్ధరాత్రి తర్వాత కుప్పకూలింది. అయితే ఈ సమయంలో వంతెనపై వాహనాల రాకపోకలు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ వంతెన కూలడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

ALso Read:Heavy rains in AP: కొట్టుకుపోయిన పాపాగ్ని బ్రిడ్జి, కడపలో కుప్పకూలిన మూడంతస్తుల భవనం

వెలిగల్లు జలాశయం (veligallu reservoir) నాలుగు గేట్లు ఎత్తారు.  దీంతో వరదనీరు భారీగా వంతెనపై అంచువరకు రెండు రోజులుగా ప్రవహించడంతో వంతెన బాగా కుంగిపోయింది. దీంతో ఈ వంతెనపై ప్రమాదం రాకపోకలకు ప్రమాదం కలుగుతుందని భావించారు. అర్ధరాత్రి వంతెన కుప్పకూలింది. ఏడు మీటర్లకు పైగా వెంతన కూలడంతో కిలోమీటర్ దూరంలోనే వాహనాలను నిలిపివేశారు. కడప నుండి అనంతపురం వెళ్లే జాతీయ రహదారి కావడంతో వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా మళ్లిస్తున్నారు. కడప నుండి తాడిపత్రికి వెళ్లే ఆర్టీసీ బస్సులను , ఇతర వాహనాలను ప్రొద్దుటూరు, ఎర్రగుంట్ల, మైదుకూరు మీదుగా మళ్లించారు.

కడప నగరంలో heavy rains కారణంగా లోతట్టు ప్రాంతాలు నీటిలో మునిగి పోయాయి. ఆదివారం నాడు తెల్లవారుజామున  kadapa పట్టణంలోని రాధాకృష్ణ నగర్‌లో మూడంతస్తుల భవనం కుప్పకూలింది. నిన్ననే ఈ  భవనం పక్కనే మరో భవనం కూలింది. మూడంతస్తుల భవనంలో  చిక్కుకొన్న నాలుగేళ్ల చిన్నారి సహా ఆమె తల్లిని సహాయక బృందాలు సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఈ భవనంలో 13 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఈ భవనం శిథిలావస్థకు చేరుకొంది. అయితే ఈ భవనాన్ని ఖాళీ చేయాలని కార్పోరేషన్ అధికారులు నోటీసులు ఇచ్చానా యాజమాన్యం స్పందించలేదని చెబుతున్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios