నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడలో ఏర్పాటు చేసిన ఈ ప్రమాణ స్వీకార మహోత్సవంలో... పార్టీ నేతలు, అభిమానులు చూస్తుండగా... జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా జగన్ కి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ శుభాకాంక్షలు తెలిపారు.

‘‘ఏపీ నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు  చేపట్టిన జగన్మోహన్ రెడ్డికి  ఇవే నా శుభాకాంక్షలు. జగన్, ఆయన మంత్రి వర్గానికి ఇవే నా బెస్ట్ విషెస్’’ అంటూ రాహుల్ ట్వీట్ చేశారు.