ప్రదేశ్ కాంగ్రెస్ కమిటి అధ్యక్షుడు రఘువీరారెడ్డి భలే జోక్ పేల్చారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా పోటీకి సిద్ధమట. 2019లో వచ్చినా లేదా అంతుకుముందే వచ్చినా పోటీకి కాంగ్రెస్ పార్టీ మాత్రం సిద్ధంగా ఉందట. ఎలాగుంది రఘువీరా మాటలు?

ప్రదేశ్ కాంగ్రెస్ కమిటి అధ్యక్షుడు రఘువీరారెడ్డి భలే జోక్ పేల్చారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా పోటీకి సిద్ధమట. 2019లో వచ్చినా లేదా అంతుకుముందే వచ్చినా పోటీకి కాంగ్రెస్ పార్టీ మాత్రం సిద్ధంగా ఉందట. ఎలాగుంది రఘువీరా మాటలు? 2050 వరకూ తామే అధికారంలో ఉండాలని ఆరాట పడుతున్న టిడిపి నేతలు మాత్రం ముందస్తు ఎన్నికలంటే టెన్షన్ పడుతున్నారు. అదే విధంగా వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని కలలు కంటున్న వైసీపీ నేతల్లోనూ టెన్షనే కనబడుతోంది. మరి, కాంగ్రెస్ ధైర్యమేమిటి?

అధికార పార్టీలోనేమో ప్రజా వ్యతిరేకత గుబులు స్పష్టంగా కనబడుతోంది. ముందస్తు ఎన్నికలంటే ఏం చెప్పి ఓట్లడగాలో అధికార పార్టీ నేతలకు అర్ధం కావటం లేదు. ప్రతిపక్షమేమో పలు నియోజకవర్గాల్లో బలహీనంగా ఉంది. కేవలం అధికార పార్టీ మీద వ్యతిరేకతనే నమ్ముకున్నట్లు కనబడుతోంది. ఇటువంటి పరిస్ధితుల్లో ముందస్తు ఎన్నికలకు సిద్ధమని కాంగ్రెస్ అధ్యక్షుడు చెప్పటమంటే జోక్ కాక మరేమిటి?

రాష్ట్ర విభజన దెబ్బకు కాంగ్రెస్ పార్టీ 2014లో కుదేలైంది. మొత్తం 175 నియోజకవర్గాల్లో ఒక్క విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో మాత్రమే డిపాజిట్ దక్కించుకున్న విషయాన్ని రఘువీరా మరచిపోయినట్లున్నారు. రాష్ట్ర విభజన చేసినందుకు, చేసిన విధానానికి జనాలకు మండిపోయి కాంగ్రెస్ పార్టీకి కొర్రు కాల్చి వాతపెట్టారు. అవే మంటే ఇంకా తగ్గలేదు. మళ్ళీ సాధారణ ఎన్నికలకు సిద్ధమని కాంగ్రెస్ ప్రకటించటాన్ని ఏమనాలి?

అప్పటి నుండి ఇప్పటి వరకూ పార్టీ పుంజుకున్న జాడైతే లేదు. ఎందుకంటే, పుంజుకున్న విషయం తెలుసుకునేందుకు అవకాశం కూడా రాలేదు. పైగా అప్పట్లో పార్టీలోని నేతల్లో చాలామంది టిడిపి, వైసీపీల్లోకి జంప్ చేసేసారు. మిగిలింది అడుగు, బోడుగే. వీళ్ళల్లో కూడా ఏదో ఒక పార్టీలోకి వెళ్ళేపోయే వారే ఎక్కువ. పోటికి సిద్ధం సరే. అసలు 175 నియోజకవర్గాల్లో పార్టీ తరపున పోటీ చేసేందుకు గట్టి అభ్యర్ధులు ఉన్నారా అన్నదే ప్రశ్న. చూద్దాం రాబోయే ఎన్నికల్లో పార్టీకి ఎన్ని ఓట్లు (సీట్లు కాదు సుమా!) వస్తాయో.