ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్ పై  ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. జగన్ గతేడాది ప్రజా సంకల్పయాత్ర పేరిట పాదయాత్ర ప్రారంభించిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ పాదయాత్ర నేటితో ముగియనుంది. ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో పైలాన్ ఆవిష్కరణ కార్యక్రమం కూడా చేపట్టారు.

కాగా.. ఈ పాదయాత్రపై రఘువీరారెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. అసలు జగన్ పాదయాత్రలో ఏముందని ప్రశ్నించారు. రోజుకి రూ.2కోట్లు ఖర్చు తప్ప.. జగన్ పాదయాత్రలో ఏమీ లేదన్నారు. జగన్ పాదయాత్ర అంతా.. సెల్ఫీలు.. నెత్తిమీద ముద్దులతో నిండిపోయిందని ఎద్దేవా చేశారు. అనంతరం వచ్చే ఎన్నికల్లో టీడీపీపై పొత్తు ఉంటుందా లేదా అన్న విషయంపై కూడా మాట్లాడారు.

ఈ విషయంలో త్వరగా నిర్ణయం తీసుకోవాలని తాము అధిష్టానాన్ని కోరామని.. పొత్తుపై త్వరలో క్లారిటీ వస్తుందని చెప్పారు. కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఓ మిథ్య అని రఘువీరా పేర్కొన్నారు.