వైయస్సార్ రైతు భరోసా : జగన్ సొంత జేబులో నుంచి ఇస్తున్నట్లు ఫోజుకొడుతున్నాడు..అందుకే త్వరలో జైలర్ సినిమా సీన్..
పీఎం కిసాన్ పథకానికి.. వైఎస్ జగన్ వైయస్సార్ రైతు భరోసా అని మార్చి.. తాటికాయంత అక్షరాలతో ముద్రిస్తున్నాడు. పోస్టర్లలో తనది, తన తండ్రిది ఫొటోలతో ఫోజులిస్తున్నాడు.

ఢిల్లీ : వైసిపి రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు మరోసారి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో త్వరలో ‘జైలర్’ సినిమా సీన్ కనిపించబోతుందని జోస్యం చెప్పారు. తండ్రి లాంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నిజస్వరూపం తెలిసిపోయింది అన్నారు. ఢిల్లీలో మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ.. జైలర్ సినిమాలో రజనీకాంత్ తన సొంత కుమారుడే పోలీస్ ఉన్నతాధికారిగా ఉండి దొంగతనాలకు పాల్పడుతుంటే చూసి తట్టుకోలేక చంపేస్తాడని.. రాష్ట్రంలో వచ్చే రోజుల్లో అలాంటి దృశ్యాలు కనిపించబోతున్నాయని అన్నారు.
ప్రస్తుతం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నా వాటికి వైయస్ జగన్ తన పేరును లేదా తన తండ్రి పేరును పెట్టుకోవడం విచిత్రంగా ఉందన్నారు. పీఎం కిసాన్ పథకానికి.. వైఎస్ జగన్ వైయస్సార్ రైతు భరోసా అని మార్చారని.. వైయస్సార్ రైతు భరోసా అని రాష్ట్ర ప్రభుత్వం దీనికి కొత్తగా నామకరణం చేసి తాటికాయంత అక్షరాలతో ముద్రించారని ఎద్దేవా చేశారు. దాని కింద ముద్రించాల్సిన పీఎం కిసాన్ అనే పేరును కనిపించి కనిపించకుండా చిన్న అక్షరాలతో ముద్రిస్తున్నారన్నారు.
ఎన్టీఆర్ జిల్లాలో దారుణం... మానసిక రోగిపై నెలల తరబడి ఆరుగురు మృ(మ)గాళ్ల లైంగికదాడి
ఈ పథకం కేవలం రాష్ట్ర ప్రభుత్వానికి చెందింది మాత్రమే కాదని.. కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యం కూడా ఉందని గుర్తు చేశారు. రైతు భరోసా పథకానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 7,500 ఇస్తే… కేంద్ర ప్రభుత్వం రూ. 6,500 ఇస్తుందని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తున్నా.. కేంద్ర ప్రభుత్వ పథకాల పేర్లను రాష్ట్ర ప్రభుత్వం మారుస్తుండడంతో…ఇది తెలిసిన కేంద్ర ప్రభుత్వం రూ.5,3 కోట్లను రాష్ట్రానికి ఇవ్వకుండా నిలిపివేసింది అన్నారు.
కేంద్ర ప్రభుత్వ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రచారం కల్పించాలని… అలా ప్రచారం కల్పించే వాటిల్లో కేంద్ర ప్రధాని ఫోటోని ఓవైపు.. ముఖ్యమంత్రి ఫోటోను మరోవైపు వేసుకోవచ్చు అన్నారు. కానీ మొత్తం సొమ్ము తన జేబులో నుంచే పెడుతున్నట్లుగా బిల్డప్ ఇస్తూ.. వైయస్ జగన్ తన ఫోటో, తన తండ్రి ఫోటో వాటి మీద ముద్రించుకోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు.
తమ పార్టీ నాయకులు బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందరీశ్వరిపైకారు కూతలు కూస్తున్నారని.. అవి వింటుంటే బాధగా అనిపిస్తుంది అన్నారు. మహిళ, ఓ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు అని కూడా చూడకుండా అనుచితంగా మాట్లాడుతున్నారు. దీనిమీద పల్లెత్తు మాట కూడా అనని ముఖ్యమంత్రి…రాష్ట్రంలో మహిళలకు ఇస్తున్న రక్షణ ఏంటని ప్రశ్నించారు. ఒక్క మహిళను అవమానిస్తే రాష్ట్ర మహిళలు అందరినీ అవమానించినట్లేనన్నారు. నరసాపురం లోక్సభ స్థానానికి టిడిపి జనసేన అభ్యర్థిగా రానున్న పార్లమెంటు ఎన్నికల్లో తన పోటీ చేయబోతున్నట్లుగా వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు తెలిపారు.