Asianet News TeluguAsianet News Telugu

జగన్ సీఎం పదవికి గండం: రఘురామకృష్ణమ రాజు సంచలన వ్యాఖ్యలు

ఏపీ సీఎం వైెఎస్ జగన్ మీద వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణమ రాజు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు వైెఎస్ జగన్ సీఎం పదవికి రాజీనామా చేయాల్సి రావచ్చునని ఆయన అన్నారు.

Raghurama Krishnama Raju makes sensational comments on YS Jagan
Author
New Delhi, First Published Nov 13, 2020, 3:50 PM IST

న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీద వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ తిరుగుబాటు ఎంపీ రఘురామ కృష్ణమ రాజు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి పదవికి జగన్ రాజీనామా చేయాల్సి రావచ్చునని ఆయన అన్నారు మాజీ ముఖ్యమంత్రులు నీలం సంజీవ రెడ్డి, ఎన్ జనార్దన్ రెడ్డిల మాదిరిగానే జగన్ కూడా రాజీనామా చేయాల్సి రావచ్చునని అన్నారు.

కోర్టు ధిక్కరణ నోటీసులు తీసుకోవడానికి జగన్ రేపో మాపో సిద్ధంగా ఉండాలని ాయన అన్నారు కోర్టు నోటీసులపై తమ వైసీపీలో ఆందోళన వ్యక్తమవుతోందని, తప్పు అంగీకరించి క్షమాపణ కోరితే జగన్ కు శిక్ష తప్పే అవకాశం ఉందని ఆయన అన్నారు. ఎన్ని సంక్షేమ పథకాలు అమలుచేసినా జగన్ కు దుబ్బాక ఫలితం తప్పదని ఆయన వ్యాఖ్యానించారు 

అమరావతి మాత్రమే ఏపీకి రాజధానిగా ఉంటుందని ఆయన అన్నారు జనగ్ మతమార్పిడులను ప్రోత్సహిస్తున్నారని ఆయన విమర్శించారు. సింహాద్రి, మాన్సాస్ భూములపై పెద్దల కన్ను పడిందని ఆయన అ్ననారు 

వైసీపీ నుంచి పార్లమెంటు సభ్యుడిగా ఎన్నీకైన రఘురామకృష్ణమ రాజు చాలా కాలంగా వైెఎస్ జగన్ ప్రభుత్వం తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. అందుకు గాను ఆయనపై అనర్హత వేటు వేయాలని వైసీపీ ఎంపీలు స్పీకర్ ఓం బిర్లాకు పిటిషన్ కూడా పెట్టుకున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios