Asianet News TeluguAsianet News Telugu

నిమ్మగడ్డ రమేష్ కుమార్ మీద కులం ముద్ర వేసి..: జగన్ పై రఘురామ ఫైర్

ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంపై వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణమ రాజు జగన్ ప్రభుత్వంపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ తో చర్చించాలని ఆయన డిమాండ్ చేశారు.

Raghurama Krishnama Raju Fires on YS Jagana over Nimmagadda Ramesh Kumar issue
Author
New Delhi, First Published Oct 10, 2020, 3:51 PM IST

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎసీఈసీ) నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంలో వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామ కృష్ణమ రాజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ మీద కులం ముద్ర వేసి ప్రతీకారం తీర్చుకునే ప్రయత్నం చేశారని ఆయన విమర్శించారు 

ప్రజాస్వామ్య వ్యవస్థ మీద వైసీపీకి నమ్మకం ఉంటే వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు కరోనా కారణంగా పంచాయతీ, స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడ్డాయని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో గుర్తు చేశారు 

ప్రజల సమస్యలను దృష్టిలో పెట్టుకుని స్తానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ తో ప్రభుత్వం చర్చించాలని ఆయన అన్నారు.

Also Read: మోడీని జగన్ కలిసిన రోజే నాపై కేసు, త్వరలో వారు జైలుకే..: రఘురామ

మాన్సాస్ ఆధ్వర్యంలో జరుగుతున్న అక్రమాలపై పూర్వ విద్యార్థులు ఆందోళన చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు ఈ ట్రస్టు ఆధ్వరంలో నడుస్తున్న కళాశాలను భ్రష్టు పట్టించే ప్రయత్నాలు ఈ ప్రభుత్వ హయాంలో జరుగుతున్నాయని కళాశాల పూర్వ విద్యార్థులు ఆవేదన చెందుతున్నట్లు ఆయన తెలిపారు. 

రాష్ట్రంలో జరుగుతున్న వాస్తవాలను బయటకు తేవడానికి చాలా మంది కేసులు పెడుతారేమోనని వైసీపీ నేతలు భయంతో ఉన్నారని ఆయన అన్నారు. నిరసనలు తెలియజేయాలని ఆయన సూచించారు న్యాయస్థానాల్లో కేసులు వేసి పోరాటం చేయాలని ఆయన అన్నారు. కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు నిజాయితీ అందరికీ తెలుసునని ఆయన అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios