రాగి జావ పిల్లలకు మంచి పౌష్టికాహారం అని రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ అన్నారు. రాజానగరం మండలంలోని పుణ్యక్షేత్రం జిల్లా పరిషత్ హైస్కూల్ లోని విద్యార్థులకు ఆయన మంగళవారం రాగి జావ పంపిణీ చేశారు. 

విద్యార్థులలో రక్త హీనత, శారీరక బలహీనత ఎక్కువగా ఉంటోందని దీనిని అధిగమించేందుకు పౌష్టికాహారాన్ని తీసుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్ విప్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ అన్నారు. రాగి జావ పిల్లలకు మంచి పౌష్టికాహారంగా ఉపయోగపడుతుందని చెప్పారు.

92వ ఏటా ఐదోసారి పెళ్లికి సిద్ధమైన మీడియా మొఘల్.. రూపర్ట్ మర్దోక్, యాన్ లెస్లీ స్మిత్‌ల లవ్ స్టోరీ ఇలా మొదలైంది

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో చదవే విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగనన్న గోరుముద్ద పథకం కింద రాగి జావ అందించే కార్యక్రమాన్ని మంగళవారం ప్రారంభించింది. ఈ కార్యక్రమాన్ని సీఎం తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. అందులో భాగంగా రాజానగరం మండలంలోని పుణ్యక్షేత్రం జిల్లా పరిషత్ హైస్కూల్ లోని విద్యార్థులకు కూడా ఎంపీ మార్గాని భరత్ రామ్ రాగి జావ అందించారు. 

ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలను భారత్-కెన్యా మ్యాచ్‌తో పోల్చిన మంత్రి అమర్‌నాథ్.. ఆయన ఏమన్నారంటే..?

ఈ పంపిణీ కార్యక్రమంలో ఏపీ హోం మంత్రి తానేటి వనిత, స్థానిక కలెక్టర్ డాక్టర్ కే మాధవీలత, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, రుడా ఛైర్ పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డితో పాటు ఇతర నాయకులు హాజరయ్యారు. ‌ఈ సందర్భంగా ఎంపీ భరత్ మాట్లాడారు. ఇక నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో వారానికి మూడు రోజుల పాటు రాగి జావను అందిస్తామని తెలిపారు. అనంతరం కలెక్టర్ మాధవీలత మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా 987 పాఠశాలల్లోని‌ 1,25,785 మంది విద్యార్థులకు రాగి జావ అందజేయనున్నామని అన్నారు.