కృష్ణా జిల్లాకు వంగ‌వీటి మోహనరంగా పేరు పెట్టేందుకు రాధా ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారో తనకు తెలియదని టీడీపీ నేత బోండా ఉమా అన్నారు. మంత్రి కొడాలి నాని, వల్లభనేని వంశీలు ఈ విషయంలో వారి నాయకుడికి ఒక్క మాట సరిపోతుందని చెప్పారు. 

టీడీపీ (tdp) నాయ‌కుడు వంగ‌వీటి రాధా (vangaveeti radha)పై ఆ పార్టీ నేత బోండా ఉమా కామెంట్స్ చేశారు. కృష్ణా (krishna) జిల్లాకు వంగ‌వీటి మోహనరంగా (vangaveeti mohana ranga) పేరు పెట్టాల‌ని చాలా మంది డిమాండ్ చేస్తున్న‌ప్ప‌టికీ.. ఈ విష‌యంలో రాధా ఎలాంటి ప్ర‌య‌త్నాలు చేస్తున్నారో త‌న‌కు తెలియ‌డం లేద‌ని చెప్పారు. మంగ‌ళ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. 

మంత్రి కొడాలి నాని (minister kodali nani), వల్లభనేని వంశీ (vallabhaneni vamshi)లతో వంగ‌వీటి రాధాకు మంచి సంబంధాలు ఉన్నాయ‌ని రాధా అన్నారు. గ‌తేడాది డిసెంబరు 26వ తేదీన వాళ్లు అంతా కార్య‌క్ర‌మాలు చేశార‌ని తెలిపారు. కృష్ణా జిల్లాకు వంగ‌వీటి మోహ‌న రంగ పేరు పెట్టాల‌ని నాని, వంశీలు ఉద్యమం చేయనక్కర్లేదని తెలిపారు. కేవ‌లం వాళ్ల నాయ‌కుడికి ఒక్క మాట చెబితే స‌రిపోతుంద‌ని అన్నారు. క‌నీసం రాధా ఆ దిశ‌గా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారో లేదా త‌ను చెప్ప‌లేన‌ని తెలిపారు. తాను రేపు దీక్ష చేప‌ట్ట‌బోతున్నాన‌ని, ఆ దీక్ష‌కు ప్ర‌జ‌లంద‌రూ కులాలు, పార్టీల‌కు అతీతంగా త‌ర‌లిరావాల‌ని కోరారు. మీడియా ద్వారా తాను అంద‌రినీ ఆహ్వానిస్తున్నాన‌ని తెలిపారు. వంగ‌వీటి రంగా అభిమానులు అందరూ దీక్షలో పాల్గొనాల‌ని కోరారు. 

ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడున్న 13 జిల్లాల స్థానంలో 26 జిల్లాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దాని కోసం గతంలోనే నోటిఫికేషన్ (notification) జారీ చేసింది. ఈ ప్రక్రియను ప్రారంభించి ప్రజల నుంచి సూచనలు, సలహాలు స్వీకరిస్తోంది. వచ్చే ఉగాది నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గత ఎన్నిక‌ల స‌మ‌యంలోనే వైసీపీ లోక్ స‌భ (lokh sabha)నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా ఏర్పాటు చేస్తాన‌ని హామీ ఇచ్చింది. అయితే అప్రతిపాదనకు లోబడుతూనే భౌగోళిక, సామాజిక, సాంస్కృతిక పరిస్థితుల్ని, సౌలభ్యాలను దృష్టిలో ఉంచుకుని కొత్త జిల్లాల సరిహద్దులు నిర్ణ‌యిస్తోంది. 

అయితే గ‌త కొంత కాలంగా జిల్లాలో పేర్లు సూచిస్తూ ప్ర‌భుత్వానికి విన‌తులు వ‌స్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కృష్ణా జిల్లాకు వంగ‌వీటి మోహ‌న రంగ పేరు పెట్టాల‌ని డిమాండ్ లు వ‌స్తున్నాయి. కర్నూలు జిల్లాకు కోట్ల విజయ భాస్కర్‌రెడ్డి (kotla vijaya bhaskar reddy), అనంతపురంకు నీలం సంజీవ్ రెడ్డి (neelam sanjeev reddy)పేరు పెట్టాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. ఈ రెండు జిల్లాలకు రెడ్డిల పేరు పెట్టాలని ఏపీ రెడ్డి సంక్షేమ సంఘం కోరుతోంది. అలాగే నంద్యాల జిల్లాకు పీవీ నరసింహారావు (pv narsimha rao) నంద్యాల జిల్లాగా పేరు పెట్టాలని ఏపీ బ్రాహ్మణ సంక్షేమ సంఘం ప్రభుత్వాన్ని కోరింది. 

ఇది ఇలా ఉండ‌గా.. హిందూపూరాన్ని జిల్లా కేంద్రంగా ప్ర‌క‌టించాల‌ని సినీ న‌టుడు, ఎమ్మెల్యే నంద‌మూరి బాలకృష్ణ (nandamuri balakrishna) డిమాండ్ చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే గ‌త శుక్ర‌వారం ఆయ‌న మౌన దీక్ష చేప‌ట్టారు. మ‌రుస‌టి రోజు హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా గుర్తించాల‌ని కోరుతూ అనంతపురం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మికి (collector nagalaxmi) వినతి పత్రం అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా నంద‌మూరి బాల‌కృష్ణ మాట్లాడుతూ.. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు హిందూపురం జిల్లాగా చేస్తానని వైసీపీ హామీ ఇచ్చింద‌ని, దానిని నిలబెట్టుకోవాలని అన్నారు. జిల్లా కోసం తాను దేనికైనా సిద్ధమని, అవసరమైతే ఎమ్మెల్యే పదవికీ రాజీనామా చేస్తాన‌ని తెలిపారు. జిల్లా కేంద్రం కోసం తాను పోరాటం చేస్తాన‌ని చెప్పారు.