ఈ అంశంపై రాజ్యసభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా పోరాడుతుందని జగన్ హామీ ఇచ్చినట్లు కృష్ణయ్య తెలిపారు. ఈ సందర్భంగా ఈనెల 17న తలపెట్టిన బీసీ శంఖారావం సభకు హాజరుకావాలని కోరినట్లు తెలిపారు. జగన్ ఆహ్వానం మేరకు తాను హాజరవుతానని స్పష్టం చేశారు.
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఈనెల 17న పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో నిర్వహించబోయే బీసీ శంఖారావం సభకు బీసీ సంఘం నేత ఆర్ కృష్ణయ్య జై కొట్టారు. శనివారం వైసీపీ అధినేత వైఎస్ జగన్ తో లోటస్ పాండ్ లో భేటీ అయిన ఆర్ కృష్ణయ్య పలు అంశాలపై చర్చించారు.
బీసీ సామాజిక వర్గం సమస్యలపైనే వైఎస్ జగన్ ను కలిసినట్లు తెలుస్తోంది. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్ తో జగన్ కు 14 అంశాల లేఖను ఆర్.కృష్ణయ్య అందజేశారు. జాతీయ స్థాయిలో చట్టసభల్లో బీసీలకు ప్రత్యేక కోటా కల్పించాలని జగన్ ను కోరినట్లు తెలిపారు.
ఈ అంశంపై రాజ్యసభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా పోరాడుతుందని జగన్ హామీ ఇచ్చినట్లు కృష్ణయ్య తెలిపారు. ఈ సందర్భంగా ఈనెల 17న తలపెట్టిన బీసీ శంఖారావం సభకు హాజరుకావాలని కోరినట్లు తెలిపారు. జగన్ ఆహ్వానం మేరకు తాను హాజరవుతానని స్పష్టం చేశారు.
అలాగే హాజరయ్యే అంశంపై బీసీ సంఘాల ప్రతినిధులతో మాట్లాడతానన్నారు. బీసీల కోసం ఏ పార్టీ సభలు పెట్టి పిలిచినా తాను హాజరవుతానని స్పష్టం చేశారు.ఈ సందర్భంలో బీసీల పక్షాన నిలబడాలని వారికి అండగా ఉండాలని జగన్ ను కోరినట్లు ఆర్ కృష్ణయ్య పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి