Asianet News TeluguAsianet News Telugu

వైఎస్ జగన్ తో ఆర్.కృష్ణయ్య భేటీ

 గత కొద్ది రోజులుగా ఆయన తెలుగుదేశం పార్టీకి అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో జగన్ ను కలవడం చర్చనీయాంశంగా మారింది. అయితే బీసీ శంఖారావం సభలో బీసీలకు సంబంధించి పలు సూచనలు సలహాలు ఇచ్చినట్లు కూడా తెలుస్తోంది. 

r.krishnaiah meets to ys jagan
Author
Hyderabad, First Published Feb 9, 2019, 5:38 PM IST

హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని బీసీ సంఘం నేత, మాజీ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య కలవడం కలకలం రేపుతోంది. తెలుగుదేశం పార్టీకి చెందిన ఆర్ కృష్ణయ్య వైఎస్ జగన్ తో భేటీ కావడం ఆసక్తి రేపుతోంది. 

అయితే బీసీ సామాజిక వర్గం సమస్యలపైనే వైఎస్ జగన్ ను కలిసినట్లు తెలుస్తోంది. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్ తో జగన్ కు 14 అంశాల లేఖను ఆర్.కృష్ణయ్య అందజేశారు.  అలాగే బీసీ సామాజిక వర్గాల సమస్యలపై కూడా వైఎస్ జగన్ తో ఆర్ కృష్ణయ్య చర్చించారు. 

ఈనెల 17న ఏలూరులో జరిగే వైసీపీ బీసీ శంఖారావం నిర్వహించబోతుంది. ఈ సమావేశంలో బీసీ డిక్లరేషన్ చేయనుంది వైసీపీ. ఈ పరిణామాల నేపథ్యంలో ఆర్ కృష్ణయ్య  వైఎస్ జగన్ తో భేటీ కావడం ప్రాధాన్యత నెలకొంది. 

ఆర్ కృష్ణయ్య 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరుపున ఎల్ బీ నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఆఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సుధీర్ రెడ్డి పై గెలుపొందారు. ఆ తర్వాత జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో మిర్యాలగూడ నియోజకవర్గం నుంచి పోటీ చేసి దారుణంగా ఓటమి పాలయ్యారు. 

అయితే గత కొద్ది రోజులుగా ఆయన తెలుగుదేశం పార్టీకి అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో జగన్ ను కలవడం చర్చనీయాంశంగా మారింది. అయితే బీసీ శంఖారావం సభలో బీసీలకు సంబంధించి పలు సూచనలు సలహాలు ఇచ్చినట్లు కూడా తెలుస్తోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios