ఏపీపీఎస్సీ ఆదివారం నాడు నిర్వహించిన గ్రూప్-2 ప్రిలిమినరీ పరీక్షల్లోని ప్రశ్నలపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల కోడ్ ఉన్న సమయంలో అధికార పార్టీకి అనుకూలంగా ప్రశ్నలు ఉన్నాయని వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.
అమరావతి: ఏపీపీఎస్సీ ఆదివారం నాడు నిర్వహించిన గ్రూప్-2 ప్రిలిమినరీ పరీక్షల్లోని ప్రశ్నలపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల కోడ్ ఉన్న సమయంలో అధికార పార్టీకి అనుకూలంగా ప్రశ్నలు ఉన్నాయని వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.
ఏపీ రాష్ట్రంలో ఏపీపీఎస్‌సీ గ్రూప్-2 పరీక్షలను నిర్వహించింది. తుపాన్, రీ పోలింగ్ దృష్ట్యా ఈ పరీక్షలను వాయిదా వేయాలని కోరినా కూడ.... తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారంగానే ఎన్నికలు నిర్వహించడాన్ని వైసీపీ నేతలు తప్పుబడుతున్నారు.
రాష్ట్రంలోని 447 గ్రూప్–2 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ ఆదివారం నాడు పరీక్ష నిర్వహించింది.రాష్ట్రవ్యాప్తంగా 727 కేంద్రాల్లో ప్రిలిమనరీ టెస్టును నిర్వహించింది. ఈ పరీక్షలకు గాను మొత్తం 2,95,036 మంది దరఖాస్తు చేసుకొన్నారు. వీరిలో పరీక్షకు హాజరైంది కేవలం 1,77,876 (77.92 శాతం) మంది మాత్రమే.
కొన్ని ప్రాంతాల్లో కేటాయించిన పరీక్ష కేంద్రానికి సంబంధించిన చిరునామా హాల్‌టిక్కెట్లలో అది ఏ ప్రాంతంలో ఉందో స్పష్టంగా లేకపోవడంతో అభ్యర్థులు ఇబ్బందులకు గురయ్యారు.
ఇదిలా ఉంటే ఏపీపీఎస్‌సీ ప్రిలిమినరీ పరీక్షల్లో అడిగిన ప్రశ్నలపై వైసీపీ నేతలు భగ్గుమంటున్నారు.కొన్ని ప్రశ్నలిలా ఉన్నాయి.
చంద్రన్న పెళ్లి కానుక పథకం కింద కులాంతర వివాహం చేసుకున్న జంటలో ఒకరు షెడ్యూల్డ్ కులానికి చెందిన వారైతే ఆ జంటకు ఇచ్చే ప్రోత్సాహక బహుమతి ఎంత?
పసుపు కుంకుమ పథకం ఏ వర్గానికి ఆర్థిక తోడ్పాటు అందించడానికి ఉద్దేశించబడింది?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వపు ఎన్టీఆర్ విదేశీ విద్య, ఆదరణ పథకం ఏ వర్గపు విద్యార్థులకు ఉద్దేశించబడింది?
చేతివృత్తుల వారికోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన ప్రముఖ పథకం పేరు?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పోర్టల్ ‘పేదరికంపై గెలుపు’ ఈ కింది వాటికి సాధారణ వేదిక?
ఏ ముఖ్యమంత్రి కాలంలో ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని నెలకొల్పాడు?
ఎన్ని కేంద్ర ప్రాయోజిత పథకాలు, కేంద్ర పథకాల అమలులో ఏపీ ప్రథమ స్థానంలో ఉంది?
మరో వైపు తెలుగు మాధ్యమంలోని ప్రశ్నపత్రానికి ఇంగ్లీష్ మాధ్యమంలోని ప్రశ్నపత్రంలోని ప్రశ్నలకు కూడ తేడాలు ఉన్నాయని కూడ కొందరు చెబుతున్నారు. ఈ పరీక్ష తీరుపై
