పుట్టపర్తి అర్బన్ డెవలప్ మెంట్ అథారిటి (పుడా) ఛైర్మన్ కడియాల సుధాకర్, సింగిల్ విండో ఛైర్మన్ ఓబులేశు, పుట్టపర్తి ఎంపిపి శ్రీరామ్ రెడ్డి భార్య, మున్సిపల్ వైస్ ఛైర్మన్ వెంకటరమణ కూడా రాజీనామాలు చేయాలని పట్టుబడుతున్నారు. ఎందుకంటే, గంగన్నతో పాటు ఐదుగురిచేత రెండున్నరేళ్ళు కాగానే రాజీనామాలు చేయించాలన్నది అప్పట్లో జరిగిన పెద్దమనుషుల ఒప్పందం.  

పుట్టపర్తి మున్సిపల్ ఛైర్మన్ గంగన్న టిడిపి నాయకత్వానికి కరెక్ట్ ఫిట్టింగ్ పెట్టారు. తన రాజీనామా విషయమై సమన్యాయం పాటించాలని ఛైర్మన్ చేస్తున్న డిమాండ్ తో పార్టీ నాయకత్వం సమాధానం చెప్పలేక గింగిరాలు తిరుగుతోంది. గంగన్న రాజీనామా వ్యవహారం జిల్లా పార్టీ నాయకత్వానికి పెద్ద తలనొప్పే కాకుండా జిల్లా వ్యాప్తంగా హాట్ టాపిక్ అయిపోయింది.

రెండున్నరేళ్ళుగా పుట్టపర్తి మున్సిపాలిటీకి గంగన్న ఛైర్మన్ గా ఉంటున్నారు. అయితే అప్పట్లో జరిగిన ఒప్పందాల ప్రకారం రెండున్నరేళ్ళు పూర్తవ్వగానే గంగన్న రాజీనామా చేయాలి. కానీ రాజీనామా చేయకుండా ఛైర్మన్ అడ్డం తిరిగారు. ఇక్కడే సమస్య మొదలైంది. మంత్రులు, జిల్లా అధ్యక్షుడు, పుటపర్తి ఎంఎల్ఏ, మాజీ మంత్రి పల్లెరఘునాధరెడ్డి చెప్పినా రాజీనామా చేయటానికి ఛైర్మన్ అంగీకరించ లేదు.

గంగన్న అడ్డం తిరగటానికి పెద్ద కతేఉంది. గంగన్నకన్నా ముందే ఎంపికైన పుట్టపర్తి అర్బన్ డెవలప్ మెంట్ అథారిటి (పుడా) ఛైర్మన్ కడియాల సుధాకర్, సింగిల్ విండో ఛైర్మన్ ఓబులేశు, పుట్టపర్తి ఎంపిపి శ్రీరామ్ రెడ్డి భార్య, మున్సిపల్ వైస్ ఛైర్మన్ వెంకటరమణ కూడా రాజీనామాలు చేయాలని పట్టుబడుతున్నారు. ఎందుకంటే, గంగన్నతో పాటు ఐదుగురిచేత రెండున్నరేళ్ళు కాగానే రాజీనామాలు చేయించాలన్నది అప్పట్లో జరిగిన పెద్దమనుషుల ఒప్పందం.

పెద్దమనుషుల ఒప్పందం అందరికీ ఒకటేలా ఎందుకు అమలు చేయటం లేదన్న చైర్మన్ ప్రశ్నకు జిల్లాలో ఎవ్వరూ సమాధానం చెప్పలేకున్నారు. ఈయనకు సమాధానం చెప్పలేక రాజీనామా వ్యవహారాన్ని పుటపర్తి ఎంఎల్ఏ పల్లె రఘునాధరెడ్డికి వదిలిపెట్టేసారు. దాంతో సమస్య ఇంకా ముదిరిపోయింది. ఎందుకంటే, రాజీనామా చేయాల్సిన ఐదుగురిలో ఒక్క గంగన్న రాజీనామా మాత్రమే పల్లె అడుగుతున్నారు. దాంతో ఛైర్మన్ అడ్డం తిరిగారు.

ఇదే విషయమై గంగన్న ‘ఏషియానెట్’ తో మాట్లాడుతూ, ఛైర్మన్ గా రాజీనామా చేయటానికి తాను సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. అయితే, తనతో పాటు రాజీనామాలు చేయాల్సిన మిగిలిన నలుగురిని వదిలేసి తన రాజీనామా కోసమే పల్లె పట్టుబట్టటంలో అర్ధం ఏంటని అడుగుతున్నారు. మిగిలిన నలుగురు రాజీనామా చేస్తేనే తాను కూడా రాజీనామా చేస్తానని లేకపోతే తాను కూడా రాజీనామా చేయనని స్పష్టంగా చెప్పారు.