Asianet News TeluguAsianet News Telugu

బిజెపి నేత దగ్గుబాటి పురంధేశ్వరికి కరోనా పాజిటివ్

బిజెపి సీనియర్ నేత దగ్గుబాటి పురంధేశ్వరికి కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ అయింది. పురంధేశ్వరి హైదరాబాదులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Purandheswari tested positive for Coronavirus KPR
Author
Hyderabad, First Published Sep 30, 2020, 8:57 AM IST

న్యూఢిల్లీ: బిజెపి నేత, మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఆమె కరోనా లక్షణాలతో బాధపడుతున్నారు. హైదరాబాదులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పురంధేశ్వరి చికిత్స పొందుతున్నారు.

కాగా, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడికి కరోనా పాజిటివ్ నిర్దారణ అయిన విషయం తెలిసిందే. ఆయనకు ఏ విధమైన లక్షణాలు కూడా కనిపించలేదని, ఆరోగ్యంగా ఉన్నారని ఉప రాష్ట్రపతి కార్యాలయం మంగళవారం ట్విట్టర్ లో ప్రకటించింది.  ఉదయం రొటీన్ గా కోవిడ్ -19 పరీక్షలు చేయించుకున్నప్పుడు ఉప రాష్ట్రపతికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలిందని చెప్పారు. 

హోం క్వారంటైన్ లో ఉండాలని ఉప రాష్ట్రపతికి వైద్యులు సూచించినట్లు తెలిాపరు. ఆయన సతీమణి ఉషకు మాత్రం నెగెటివ్ వచ్చిందని, ఆమె ఐసోలేషన్ లోకి వెళ్లారని ఉప రాష్ట్రపతి కార్యాలయం తెలిపింది. 

ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు నిర్ధారణ కాగానే పలువురు స్పందించారు. త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా ద్వారా సందేశాలు పంపించారు త్రిపుర సీఎం విప్లవ్ కుమార్ దేవ్, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి, రాజస్థాన్ మాజీ సీఎం వసుంధర రాజే సిథియా తదితరులు వెంకయ్య ఆరోగ్యం కోసం ప్రార్థిస్తూ ట్వీట్లు చేశారు. 

తన తండ్రి యోగక్షేమాలు కాంక్షించిన వారందరికీ వెంకయ్య నాయుడి కూతురు దీపా వెంకట్ ఓ ప్రకటనలో ధన్యవాదాలు తెలిపారు. వెంకయ్య నాయుడి ఆరోగ్య కొలమానాలు బాగున్నాయని చెప్పారు. 

భగవంతుడి దయ వల్ల వెరల్ లోడ్ చాలా తక్కువగానే ఉంనది ఆమె చెప్పారు. ఛాతీ, ఊపిరితిత్తుల  సీటీ స్కాన్ లోనూ అంతా బాగున్నట్లు వచ్చిందని చెప్పారు . 

Follow Us:
Download App:
  • android
  • ios